Samantha Preetham : ప్రీత‌మ్‌తో ఫుల్ చిల్ అవుతున్న స‌మంత‌.. చ‌క్క‌ర్లు కొడుతున్న వీడియో

Samantha Preetham : సమంత స్టైలిష్ట్, డిజైనర్‌గా ప్రీతమ్ ఇటీవ‌ల వార్త‌ల‌లో తెగ నానుతున్న విష‌యం తెలిసిందే. గతంలో ఓసారి ప్రీతమ్‌తో ఎంతో సన్నిహితంగా ఉన్న ఫోటోను సమంత షేర్ చేయడంతో అతగాడు లైమ్ లైట్‌లోకి వచ్చాడు. సోఫా మీద ఇద్దరూ కూర్చోవడం.. అందులోనూ సమంత తన కాళ్లను ప్రీతమ్ ఒళ్లో పెట్టుకుని ఉండటం, ఐ లవ్యూలు అంటూ చెప్పుకోవడంతో ప్రీత‌మ్‌, స‌మంత‌పై నెటిజ‌న్స్ ఫైర్ అయ్యారు.

TheNewsQube-
Samantha and her stylist Preetham viral video
Samantha and her stylist Preetham viral video

ఇక సమంత నాగ చైతన్య విడాకుల విషయంలోనూ ప్రీతమ్ జుకల్కర్ పేరు ఎక్కువగా వినిపించింది. ప్రీతమ్ వల్లే వ్యవహారం విడాకుల వరకు వెళ్లిందంటూ నానా రకాల చెత్తంతా రాశారు. చివరకు సంబంధాలు కూడా అంటగట్టేశారు. కానీ తాను సమంతను అక్క అని పిలుస్తాను అని, ఆ విషయం చైతూకి కూడా తెలుసంటూ.. ప్రీతమ్ ఎమోషనల్ అయ్యాడు.

Samantha and her stylist Preetham viral video
Samantha and her stylist Preetham viral video

ఇక‌ శ్రీరెడ్డి ఈ విషయంలోకి దూరి, ప్రీతమ్ గే అంటూ ఓ బాంబ్ పేల్చింది. అందులో ఎంత నిజమున్నది అనేది ఆమెకే తెలియాలి. అల్లు స్నేహారెడ్డికి కూడా ప్రీతమ్ స్టైలిష్ట్‌గా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. దీపావళికి ప్రీతమ్ రెడీ చేసిన డ్రెస్‌లో అల్లు స్నేహారెడ్డి అదిరిపోయింది. ఆ దుస్తులు కూడా ప్రీతమ్ డిజైన్ చేసినట్టు చెప్పుకొచ్చింది.

ఇక తాజాగా చిరంజీవి కూతురు శ్రీజ పోస్ట్‌పై ప్రీత‌మ్ కామెంట్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. శ్రీజ తనకు బర్త్‌డే విషెస్ తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ తన ఫొటోతో పోస్ట్‌ షేర్‌ చేసింది. దీనికి ప్రీతమ్‌ ‘సుందర్ లడికీ(అందమైన అమ్మాయి)’ అంటూ కామెంట్‌ చేశాడు. దీంతో నెటజన్ల ఫోకస్‌ ప్రీతమ్‌ కామెంట్‌పై పడింది.

చూస్తుంటే ప్రీతమ్‌ సమంతకు మాత్రమే కాదు టాలీవుడ్‌కు చెందిన పలువురికి డిజైనర్‌గా వ్యవహరిస్తున్నాడంటూ చర్చించుకుంటున్నారు. అంతేగాక సమంతతో పాటు మెగా కుటుంబానికి కూడా ప్రీతమ్‌ సుపరిచితుడేనంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.