Samantha: స్ట‌న్నింగ్ డెసిష‌న్ తీసుకున్న స‌మంత‌.. ఇక‌పై వాటి దూరమ‌ని కామెంట్

Samantha: తెలుగు ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్స్ లిస్ట్ సిద్ధం చేస్తే అందులో సమంత అక్కినేని పేరు ఇప్పటికీ ఉంటుంది. అదేంటి ఇప్పటికీ అంటున్నారు. ఈమె సినిమాలు చేయడం లేదు కదా అనుకుంటున్నారా..? అవును సినిమాలు చేసినా చేయకపోయినా టాప్ హీరోయిన్ హోదా మాత్రం అలాగే మెయింటేన్ చేస్తుంది స్యామ్. అక్కినేని కోడలు అయినా తర్వాత కూడా ఈమె కోసం స్టార్ డైరెక్టర్స్ కథలు రాస్తున్నారు.. నిర్మాతలు కోట్ల రూపాయలు ఇవ్వడానికి సై అంటున్నారు.

Samantha

మొన్నటికి మొన్న ది ఫ్యామిలీ మ్యాన్ 2 లో నటించినందుకు ఏకంగా 4 కోట్ల పారితోషికం అందుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికీ సమంత ఓకే అనాలే కానీ వరస అవకాశాలు ఇస్తూనే ఉంటారు దర్శకులు. కానీ కొన్నేళ్లుగా సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉంటుంది స్యామ్. తెలుగులో జాను సినిమా తర్వాత మరో సినిమా ఒప్పుకోడానికి 8 నెలలు టైమ్ తీసుకుంది సమంత.

ప్రస్తుతం గుణ శేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమాలో నటిస్తుంది ఈమె. ఈ సినిమా షూటింగ్ మొదలైంది కూడా. ఇందులో సమంతకు జోడీగా మలయాళ హీరో దేవ్ మోహన్ దుశ్యంతుడిగా నటిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత మరే తెలుగు సినిమా కూడా సైన్ చేయలేదు సమంత. తాజాగా సమంత సినిమా కెరీర్ గురించి ఇండస్ట్రీలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఇప్పుడు ఒప్పుకున్న సినిమాల వరకు మాత్రం పూర్తిచేసి ఆ తర్వాత సినిమాలకు కొన్నేళ్ల పాటు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతుంది.

ఈ నిర్ణయం తీసుకోడానికి కారణం వెబ్ సిరీస్. సినిమా కంటే తక్కువ కష్టమే ఇందులో పడినా కూడా ప్రతిఫలం భారీగా వస్తుంది. అందుకే సమంత సినిమాలు కాకుండా కేవలం డిజిటల్ పైనే ఫోకస్ చేసేందుకు కొన్నేళ్ల పాటు సినిమాలు త్యాగం చేయాలని నిర్ణయించుకుంది. మరి ఈ విషయం తెలుగు, తమిళ దర్శకులకు తెలిస్తే అంతకంటే షాక్ వాళ్లకు మరోటి ఉండదేమో..?