Samantha: స‌మంత‌కు అరుదైన గౌర‌వం.. తెగ సంతోషించిన అక్కినేని కోడలు

Samantha: అక్కినేని కోడ‌లు స‌మంత‌కు ఉన్న టాలెంట్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. న‌టిగా ఇన్నాళ్లు అల‌రించిన స‌మంత ఇటీవ‌ల ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌తో డిజిట‌ల్ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. ఇటీవ‌ల ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ 2021” అవార్డ్స్ ను ప్రకటించ‌గా, ఇందులో “ఫ్యామిలీ మ్యాన్-2” రెండు అవార్డులను దక్కించుకుంది. మనోజ్ బాజ్‌పేయి ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్నాడు. సమంత అక్కినేని ఈ సిరీస్‌ లో ఉత్తమ నటన కనబర్చినందుకు అవార్డును సొంతం చేసుకుంది.

తెలుగు, త‌మిళంలో వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ వ‌చ్చిన స‌మంత ఏం మాయ చేశావే’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయింది. ఒక్కో మెట్టూ ఎక్కుతూ వ‌చ్చిన స‌మంత ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒక‌రిగా మారింది. పెళ్లి త‌ర్వాత కూడా వ‌రుస సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తుంది.

కెరీర్‌లోఎన్నో అద్భుత‌మైన చిత్రాల‌లో న‌టించిన స‌మంత‌కు అరుదైన గౌరవం దక్కింది. ఫెమినా ఫాబ్ 40లో తాజాగా సమంతకు చోటు దక్కింది. ‘నాలుగు ఫిలిమ్‌ఫేర్ అవార్డులు, రెండు నంది అవార్డులు, నాలుగు సౌత్ ఇండియా ఇంటర్‌సేషనల్ మూవీ అవార్డులు, 3 సిని‘మా’ అవార్డులు గెలుచుకున్న 2021కి ఎంతో ప్రభావం చూపించే మహిళల జాబితాలో చోటు దక్కించుకుంది’ అంటూ ఫెమినా పేర్కొంది.

త‌న‌కు అరుదైన గౌర‌వం ద‌క్క‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేసిన స‌మంత ఇది తనకు ఎంతో గర్వకారణం, ధన్యవాదాలు శామ్ రీట్వీట్ చేసింది. స‌మంత న‌టించిన శాకుంత‌లం చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అలానే ఆమె ప్ర‌స్తుతం త‌మిళ చిత్రంతో బిజీగా ఉంటూనే ఫ్రెండ్స్ తో ఫుల్ ఎంజాయ్ చేస్తుంది.