Samantha: బుద్ది ఉందా.. అంటూ రిపోర్ట‌ర్‌పై మండిప‌డ్డ స‌మంత‌

Samantha: అక్కినేని స‌మంత గ‌త కొద్ది రోజులుగా ఎక్క‌డికి వెళ్లిన సోలోగానే వెళుతుంది. త‌న రిలేష‌న్ షిప్‌పై ఎన్ని పుకార్లు వచ్చినా వాటిపై స్పందించకుండా త‌న ప‌ని తాను చేసుకుంటూ పోతుంది. తాజాగా ఈ అమ్మ‌డు తిర‌మలకి చేరుకోగా, అక్క‌డ శ్రీవారిని ద‌ర్శించుకుంది. విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు.

Samantha Akkineni FlRES On Reporter At Tirumala Visit
Samantha Akkineni FlRES On Reporter At Tirumala Visit

దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం పలకగా.. ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సమయంలో మీడియావారు ఆమెని ఓ ఫొటో తీసుకుంటామని రిక్వెస్ట్ చేశారు. దానికి ఆమె ‘గుడికి వచ్చి.. బుద్ధుందా?’.. అంటూ సమాధానమిచ్చారు.

చిత్తూరు జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీ కాళహస్తీశ్వర దేవాలయాన్ని దర్శించుకున్నారు. మహాన్యాస ఏకాదశి రుద్రాభిషేకం పూజలో పాల్గొన్న ఆమె, తర్వాత స్వామి వారిని, అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం తరపున వేద పండితులు మంత్రోఛ్చరణలతో ఆశీర్వదించి తీర్థ – ప్రసాదాలను, జ్ఞాపికలను అందజేశారు. అయితే సమంత ఒక్కరే దైవ దర్శనానికి వెళ్ళడం ప్ర‌ధాన్య‌త సంత‌రించుకుంది.

సమంత నటించిన ‘శాకుంతలం’ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. అలాగే తమిళంలో కాత్తు వాక్కుల రెండు కాదల్‌ మూవీలో నటిస్తున్నారు. విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వంతో తెరకెక్కితున్న ఈ మూవీలో విజయ్‌ సేతుపతి, నయన తారలు కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.