Samantha : న‌య‌న‌తార‌ని తెగ పొగిడేస్తూ బ‌ర్త్ డే విషెస్ తెలిపిన స‌మంత‌

Samantha : సౌత్ ఇండ‌స్ట్రీలో లేడి సూప‌ర్ స్టార్‌గా అంద‌రి మ‌న‌సులని గెలుచుకున్న అందాల ముద్దుగుమ్మ న‌య‌న‌తార. నేడు (నవంబర్‌18న) 37వ వసంతంలోకి అడుగుపెట్టింది న‌య‌న్. ఈ నేపథ్యంలో ఆమె ప్రియుడు, దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ నయన్‌ పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్‌గా ప్లాన్‌ చేశాడు.

Samantha about Nayanatara and his movies
Samantha about Nayanatara and his movies

బుధవారం అర్ధరాత్రే కేక్‌ కటింగ్‌ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశాడు. ఈ వేడుకకు సమంత, విజ‌య్ సేతుప‌తి కూడా హాజ‌ర‌య్యారు.
విఘ్నేష్‌ దర్శకత్వంలో నయనతార, సమంత, విజయ్‌సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘కాత్తు వాక్కుల రెండు కాదల్‌’. కాగా నయన్‌ పుట్టిన రోజును పురస్కరించుకుని చిత్ర బృందం సినిమాలో ఆమె పోషించిన ‘కణ్మణి’ పాత్ర పోస్టర్‌ను విడుదల చేశారు.

Samantha about Nayanatara and his movies
Samantha about Nayanatara and his movies

పోస్ట‌ర్‌ని ఇన్‌స్టాలో పంచుకుని తన ప్రియురాలికి బర్త్‌డే విషెస్ చెప్పుకొచ్చాడు విఘ్నేష్‌. ‘ కణ్మణి, తంగమేయి నా ఎల్లమ్మాయికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. నీ ప్రేమ, ఆప్యాయతలతో నా జీవితం పరిపూర్ణమైంది. నువ్వు ఎప్పుడూ ఇలాగే అందంగా, ఆనందంగా ఉండేలా ఆ భగవంతుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’ అని ప్రియురాలిపై ప్రేమను కురిపించాడు.

ఇక స‌మంత సెట్లో జ‌రిగిన బ‌ర్త్ డే వేడుక‌ల‌కి సంబంధించిన ఫోటొలు షేర్ చేస్తూ బ‌ర్త్ డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేసింది. ఆమె ఇండ‌స్ట్రీలో అనుకున్న‌ది సాధించింది అనేలా స‌మంత త‌న పోస్ట్‌లో కామెంట్ చేసింది. ఈ పోస్ట్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది.

విజయ్‌ సేతుపతి, నయనతార, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కాత్తు వాక్కుల రెండు కాదల్‌’. తమిళంతో పాటు తెలుగు భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుంది. విఘ్నేశ్‌ శివన్ దర్శకత్వం వహిస్తున్నాడు. నయనతార, విఘ్నేష్‌లకు చెందిన రౌడీ పిక్చర్స్‌ సంస్థ, 7 స్ర్కీన్స్‌ స్టూడియోస్‌ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాయి. చిత్రంలో ఖతిజా పాత్రలో నటిస్తోన్న సమంతను పోస్టర్‌, కణ్మణి పాత్రలో నటిస్తోన్న నయనతార పోస్టర్లను ఇప్ప‌టికే విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే.