Samantha: విడాకుల తర్వాత చీరకట్టులో మెరిసిపోతున్న సమంత.. నవ్వుతూ ఫోజులు

Samantha: అక్కినేని నాగచైతన్యతో విడిపోతున్నట్లు సమంత ఇటీవల ప్రకటించిన సంగతి అందరికీ విదితమే. అయితే, సమంతపై కొద్దిరోజులు కొందరు నెటిజన్లు నెగెటివ్ కామెంట్స్ చేయగా, వాటికి సమంత రిప్లయి కౌంటర్ కూడా ఇచ్చింది. తాను అవకాశవాదిని కాదని, తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే హక్కు ఎవరికి లేదని కౌంటర్ ఇచ్చింది. ఈ సంగతులు పక్కనబెడితే సమంత షేర్ చేసిన ఇంట్రెస్టింగ్ ఫొటో ఒకటి ప్రజెంట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Samantha

ఇకపోతే సమంతకు సంబంధించిన ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ అయింది. సదరు పోస్టులో అందాల కుందనపు బొమ్మలా సమంత మెరిసిపోతోంది. సంప్రదాయానికి ప్రతీక అయిన చీరలో సమంత‌ను చూసి నెటిజన్లు వావ్ అంటున్నారు. విజయలక్ష్మి డీర్ మినప గుళ్ల కోసం సమంత చేసిన యాడ్‌లో ఉన్న ఫొటో అది కాగా ఆ ఫొటోను చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫొటోను చూసి కొందరు నెటిజన్లు ‘బ్యూటిఫుల్ సామ్, లవ్ లీ’ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఈ పోస్టుకు సంబంధించిన క్యాప్షన్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది.

Samantha

చై సామ్ లవ్ సింబల్, హీరోయిన్స్, కాజల్ అగర్వాల్, కృతిసనన్, కీర్తి సురేశ్, కృతికర్బంద, అనుష్కశర్మ, అనుష్కశెట్టి, అనుపమా పరమేశ్వరన్, రష్మిక మందన, తమన్నా, ఇలియానా ద క్రూజ్, నివేతా థామస్, పవన్ కల్యాణ్, షారుక్ ఖాన్, దళపతి విజయ్ హ్యాష్‌ట్యాగ్స్ ఈ పోస్టులో ఉన్నాయి. విజయలక్ష్మి డీర్ మినప గుళ్ల యాడ్ బాగా పాపులర్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ యాడ్‌లో సంప్రదాయ నృత్యం నేర్చుకునే యువతిగా సమంత చీరకట్టులో కనిపించడం ప్రతీ ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఇకపోతే సమంత డైవోర్స్ మ్యాటర్ తర్వాత ప్రజెంట్ ఫుల్ బిజీగా ఉండాలనుకుందట. ఈ క్రమంలోనే వరుస సినిమాలకు కమిట్ అవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే పాన్ ఇండియా ఫిల్మ్ ‘శాకుంతలం’, వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి ‘కాతు వాకుల రెండు కాదల్’ చిత్రాలను పూర్తి చేసిన సమంత.. త్వరలో హిందీ ప్రాజెక్టులను ఓకే చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్స్ అతి త్వరలో వస్తాయని సమాచారం.

 

SamanthaSamantha