Pawan Kalyan: మ‌రోసారి ప‌వ‌న్‌తో జోడి క‌ట్ట‌బోతున్న స‌మంత‌..!

Pawan Kalyan: కొన్ని కాంబినేష‌న్స్‌కి సంబంధించిన వార్త‌లు ఏవైన సోష‌ల్ మీడియాలో వ‌చ్చాయంటే వాటిపై అభిమానుల‌లో బోలెడ‌న్ని ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉంటాయి. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌- స‌మంత కాంబినేష‌న్‌లోమ‌రో సినిమా సెట్ అవుతుంద‌నే వార్త సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. ఇద్దరు టాప్ స్టార్స్ మరో సారి జ‌త క‌డితే ఆ ప్ర‌భంజ‌నం ఏ విధంగా ఉంటుందో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌క్క‌ర్లేదు.

Pawan Kalyan

స‌మంత‌.. ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం క‌థానాయిక‌లంద‌రికి రోల్ మోడ‌ల్‌గా మారింది. పెళ్లైన త‌ర్వాత కూడా వైవిధ్యమైన పాత్ర‌లు పోషిస్తూ అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందుతుంది. సాధార‌ణంగా పెళ్లైతే కెరీర్ ముగిసిన‌ట్టేన‌ని అంద‌రు భావిస్తారు.కాని స‌మంత కెరీర్ ఇందుకు భిన్నంగా ఉంది. స్టార్ హీరోల సినిమా ఆఫ‌ర్స్ పొంద‌డ‌మే కాక మంచి వెబ్ సిరీస్‌ల‌లో చాన్స్ ద‌క్కించుకుంటుంది. రీసెంట్‌గా స‌మంత న‌టించిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ విడుద‌ల కాగా, ఇందులో రాజీ అనే పాత్ర‌లో జీవించేసింది.

నాగ చైత‌న్యని వివాహ‌మాడిన త‌ర్వాత స‌మంత కెరీర్ జెట్ స్పీడ్‌తో దూసుకెళుతుంది. పవర్ ఫుల్ రోల్స్ ని సెలక్ట్ చేసుకుంటూ ముందుకి పోతుంది.రంగస్థలం, మజిలీ, ఓ బేబీ సినిమాలతో పెళ్లి తర్వాత సమంతా హ్యాట్రిక్ హిట్స్ ని ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు త‌న ఖాతాలో భారీ ప్రాజెక్టులే ఉన్నాయి. గుణ‌శేఖ‌ర్ తెర‌కెక్కిస్తున్న శాకుంతలం చిత్రంలో శ‌కుంత‌ల‌గా క‌నిపించి అల‌రించ‌నుంది స‌మంత‌. ఇందులో సామ్ పాత్ర ప్రేక్ష‌కుల‌కి స‌రికొత్త వినోదం పంచ‌డం ఖాయం అని గుణ‌శేఖ‌ర్ అంటున్నాడు.

Pawan Kalyan

తాజా స‌మాచారం ప్ర‌కారం స‌మంత మ‌రోసారి ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న న‌టించ‌నుంద‌నే టాక్ న‌డుస్తుంది. గ‌తంలోత్రివిక్ర‌మ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ కి జోడీగా న‌టించింది. వారిద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ బాగా వ‌ర్క‌వుట్ అయింది. ఇప్పుడు ఈ కాంబినేషన్ మరో సారి రిపీట్ అయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.హరీష్ శంకర్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో హీరోయిన్స్ గా సమంతని తీసుకునే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.

హ‌రీష్ శంక‌ర్ త‌న సినిమాకు హీరోయిన్‌గా పూజాహెగ్డేని అనుకున్నాడు. కాని ఆమె ప్ర‌స్తుతం వివిధ భాష‌ల‌లో వైవిధ్య‌మైన సినిమాలతో బిజీగా ఉంది. ఈ క్ర‌మంలో హ‌రీష్ శంక‌ర్ నెక్ట్స్ ఆప్ష‌న్ స‌మంత అని అనుకున్న‌ట్టు తెలుస్తుంది. లాక్‌డౌన్ త‌ర్వాత హ‌రీష్ శంక‌ర్- ప‌వ‌న్ సినిమా మొద‌లు కానున్న‌ట్టు తెలుస్తుంది.