సమంత ఇంత ఫిట్‌గా ఉండడానికి అసలు కారణం ఇదన్నమాట!
Samsthi 2210 - December 4, 2020 / 06:23 PM IST
సినిమాలకు రాక ముందు ఫంక్షన్స్‌లో పన్నీరు జల్లే సమంత ఇప్పుడు స్టార్ హీరోయిన్ రేంజ్‌కు వెళ్ళింది. మరి ఈ అమ్మడు ఆ స్థాయికి చేరుకుంది అంటే దాని వెనుక మాములు కృషి లేదు. తన తొలి సినిమా ఏ మాయ చేశావే నుండి ఈ ఏడాది వచ్చిన జాను వరకు చాలా కష్టపడుతూ వచ్చింది. అక్కినేని కోడలిగా ప్రమోషన్ అందుకున్న తర్వాత కూడా సమంత సినిమాలతో అలరిస్తూనే ఉంది. త్వరలో నందిని రెడ్డి దర్శకత్వంలో సినిమా చేయనున్న సమంత ప్రస్తుతం డిజిటల్ షోస్‌తో బిజీగా ఉంది.
ఒకవైపు ఆహాకి సంబంధించి సామ్ జామ్ అనే షో చేస్తుండగా, మరో వైపు ఫ్యామిలీ మెన్ 2 అనే వెబ్ సిరీస్ చేస్తుంది. సామ్ జామ్ కార్యక్రమంలో సమంత సెలబ్రిటీల మనోగతాలు వారికి సంబంధించిన కొన్ని ముఖ్య విషయాలు అడుగుతుంది. అయితే పెళ్లైన తర్వాత స్టార్ హీరొయిన్స్ కూడా సినిమాలకు గుడ్ బై చెప్పి కాపురాలు చేసుకుంటుండగా, సమంత మాత్రం చాలా బిజీగా మారింది. గ్లామర్, ఫిట్ నెస్ విషయంలోను ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ వరుస ఆఫర్స్ అందుకుంటుంది. రీసెంట్గా తన భర్త నాగచైతన్యతో కలిసి మాల్దీవులకి వెళ్లి వచ్చిన సమంత ప్రస్తుతం తన తాజా ప్రాజెక్ట్స్ పై దృష్టి పెట్టింది
అయితే ఫిట్నెస్ను కాపాడునుకునేందుకు సమంత పడే కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. తన వర్కవుట్స్‌కి సంబంధించి అప్పడప్పడు వీడియోలు షేర్ చేస్తూ ఉండే సమంత తాజాగా మరో వీడియో షేర్ చేసింది. ఇందులో ఆమె తన పెట్ డాగ్‌తో కలిసి వర్కవుట్స్ చేస్తుంది. ఈ వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. సమంత ఫిజికల్ ఫిట్ నెస్ కోసం పడుతున్న కష్టం అందరిని అబ్బురపరుస్తుండగా, ప్రస్తుతం ఈ వర్కవుట్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.