Sam-Chay: వ‌చ్చే ఏడాది వ‌ర‌కు సామ్- చై భార్య‌ భ‌ర్త‌లే.. ఏ క్ష‌ణ‌మైన క‌లిసే అవ‌కాశం ఉంది..!

Sam-Chay: అక్క‌నేని నాగ చైత‌న్య నుండి విడిపోయిన‌ప్ప‌టి నుండి స‌మంత గడ్డు కాలం ఎదుర్కొంటుంది. ముఖ్యంగా ఆమెని టార్గెట్ చేస్తూ కొంద‌రు దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. వీరి మధ్య దూరానికి కారణమంటూ ప్రీతమ్‌ జుకల్కర్‌ని దూషించడం మొదలుపెట్టారు సామ్‌-చై అభిమానులు. ‘‘సమంతని నేను అక్కలా భావిస్తా. తనని జీజీ (హిందీలో ‘అక్క’) అని పిలుస్తా. అన్న కూడా విమ‌ర్శ‌లు ఆగ‌డం లేదు.

Sam-Chay are Officially Husband and Wife till this Year end
Sam-Chay are Officially Husband and Wife till this Year end

అయితే సమంత, నాగ చైతన్య విడాకుల వ్య‌వ‌హారం యావత్ సినీ పరిశ్రమను షాక్‌కి గురయ్యేలా చేసింది. ఎంతో మంది సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు ఈ విషయంలో వారికి మద్దతుగా నిలిచి ధైర్యం చెప్పగా.. ఇంకొంత మంది ఏదో ఒక సైడ్ తీసుకుని విమర్శలు గుప్పించారు. అయితే మ‌ళ్లీ వీరిద్ద‌రు క‌లిస్తే బాగుండంటూ చాలా మంది అభిమానులు ట్వీట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

నాగ చైతన్య, సమంతల విడాకులపై అక్కినేని సన్నిహిత వర్గాలు చెప్పుకుంటున్న టాక్ ప్రకారం వాళ్లకు అధికారికంగా విడాకులు మంజూరు కావడానికి మరో మూడ్నాలుగు నెలల సమయం పట్టే వీలుందని తెలుస్తోంది. ఇప్పటికే సమంత, చైతూ జంట విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించినట్టు సమాచారం.

అయితే, చట్ట ప్రకారం ఎవరైనా జంట ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించిన అనంతరం వారికి మూడు నెలల సమయం ఇచ్చి, మూడుసార్లు కౌన్సిలింగ్ చేసిన తర్వాతే కోర్టు తుది నిర్ణయం తీసుకుంటుంది. విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న జంట ఫ్యామిలీ కోర్టు కౌన్సిలింగ్‌లో మనసు మార్చుకున్నట్టయితే.. వారికి విడాకులతో పని లేకుండా తిరిగి కాపురం చేసుకునే వీలు ఉంటుంది. అప్పటికీ వాళ్లు మనసు మార్చుకోకపోతేనే కోర్టు విడాకులు మంజూరు చేస్తుంది.

చైతూ, సమంతల తీరు చూస్తే.. వాళ్లు తీసుకున్న నిర్ణయం పట్ల చాలా స్పష్టతతో ఉన్నట్టే అర్థమవుతోంది. అయితే చైతూ, సామ్ జంటకు వచ్చే ఏడాది జనవరిలో.. అంటే 2022 జనవరిలో అధికారికంగా విడాకులు మంజూరు అయ్యే అవకాశాలు ఉన్నాయని.. ఆ తర్వాత వారి నుంచి తమ డైవర్స్‌పై మరో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంద‌రు ముచ్చ‌టించుకుంటున్నారు.