Allu arjun : అల్లు అర్జున్ హిట్ సాంగ్‌కి సల్మాన్ అదిరిపోయో స్టెప్స్..!

Allu arjun : అల్లు అర్జున్ నటించిన సూపర్ హిట్ సినిమా డీజే..దువ్వాడ జగన్నాథం. ఈ సినిమాలో ఉన్న సూపర్ హిట్ సాంగ్ తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్ నటించిన రాధే సినిమాలో చూడాబోతున్నాము. డ్రగ్ మాఫియాను అంతం చేసే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా విభిన్న గెటప్ లో సల్మాన్ రాధే సినిమాలో కనిపించబోతున్నాడు. సల్మాన్ తను నటించే హిందీ సినిమాలలో తెలుగు సినిమా రెఫరెన్స్ సాంగ్స్‌ను వాడుకుంటాడన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా నటించిన ‘రాధే’ సినిమా కోసం తెలుగు పాటను రీమిక్స్ చేశారు.

salman tremendous steps for  allu-arjun hit songs-
salman tremendous steps for allu-arjun hit songs-

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘డీజే-దువ్వాడ జగన్నాథం’ సినిమాలోని ‘సీటీమార్’ సాంగ్‌ను రాధే సినిమాలో రీమిక్స్ చేశారు. ఈ పాటలో దిశా పటానీతో కలిసి సల్మాన్ వేసిన స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్స్‌గా నిలుస్తున్నాయి. హిందీలో కూడా దేవిశ్రీప్రసాద్ ట్యూన్ చేసిన ఈ సాంగ్‌కి.. కొరియోగ్రఫీ కూడా తెలుగు పాట తరహాలో వుండటం హాట్ టాపిక్ అవుతోంది. సల్మాన్ ఖాన్ నటించిన గత చిత్రాలలో కూడా తెలుగులో హిట్ అయిన ‘పోకిరి’ ‘వాంటెడ్’ గా రీమేక్ చేసి హిట్ కొట్టాడు. అలానే ‘రెడీ’ ‘కిక్’ సినిమాలను అదే పేరుతో రీమేక్ చేసి హిట్ అందుకున్నాడు.

Allu arjun : అల్లు అర్జున్ సీటీమార్ సాంగ్ రీమేక్ చేయడం ఆసక్తికరంగా మారింది.

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘స్టాలిన్’ సినిమాని హిందీలో ‘జయహో’ పేరుతో రీమేక్ చేశాడు. అలాగే ‘ఆర్య 2’ సినిమాలోని ‘రింగ రింగ’ పాటను ‘రెడీ’ సినిమాలో రీమేక్ చేశాడు. తాజాగా రాధే సినిమాలో అల్లు అర్జున్ సీటీమార్ సాంగ్ రీమేక్ చేయడం ఆసక్తికరంగా మారింది. ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సౌత్ కొరియన్ మూవీ ‘వెటరన్’ కు రీమేక్ గా రూపొందించారు. ఇక ఈ సినిమా మే 13న థియేటర్లతో పాటు ‘పే పర్ వ్యూ’ పద్ధతిలో జీ ప్లెక్స్ – డిష్ టీవీ – డీటుహెచ్ – టాటా స్కై – ఎయిర్ టెల్ డిజిటల్ టీవీల్లోనూ ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement