SALMAN: రెండో డోస్ తీసుకున్న స‌ల్మాన్ ఖాన్.. ప్ర‌తి ఒక్క‌రు వేయించుకోవాలంటూ పిలుపు

ప్ర‌స్తుతం క‌రోనా విజృంభిస్తున్న నేప‌థ్యంలో సామాన్యులు, సెల‌బ్రిటీలు త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ క‌రోనా నుండి కాపాడుకుంటున్నారు. వ్యాక్సిన్ అందుబాటులో ఉన్న నేప‌థ్యంలో వీలైనంత వ‌ర‌కు వ్యాక్సిన్ వేసుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ దాద‌ర్‌లోని ఓ హాస్పిట‌ల్‌లో వ్యాక్సిన్ తీసుకున్నారు. స‌ల్మాన్‌తో పాటు అత‌ని సోద‌రుడు సోహేల్ ఖాన్ కూడా వ్యాక్సినేష‌న్ సెంట‌ర్‌లో క‌నిపించాడు. అత‌ను కూడా సెకండ్ డోసు వేసుకున్న‌ట్లు తెలిసింది. ఖాన్ సోద‌రులు వ్యాక్సినేష‌న్ సెంట‌ర్‌కు చేరుకున్న దృశ్యాలు ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్ అయ్యాయి.

. స‌ల్మాన్ న‌టించిన రాధే చిత్రం.. రంజాన్ సంద‌ర్భంగా ఈనెల 13వ తేదీన ఆన్‌లైన్‌లో రిలీజైన విష‌యం తెలిసిందే. ‘రాధే’ సినిమా మొదటి రోజు ఏకంగా 100 కోట్ల కు పైగా వసూళ్లు సాధించినట్లుగా తెలుస్తోంది. సినిమాను మొదటి రోజు ఓటీటీ లో అది కూడా పే పర్ వ్యూ ద్వారా ఎక్కువ మంది చూస్తారా అంటూ చాలా మంది అనుమానం వ్యక్తం చేశారు. కాని సల్మాన్ ఖాన్ క్రేజ్ ఎలాంటిదో దీంతో తేలిపోయింది.సినిమా మొదటి రోజు భారీ వసూళ్లను అయితే దక్కించుకుంది కాని సినిమా కు మాత్రం ప్లాప్ టాక్ వచ్చింది.