RRR: ఆర్ఆర్ఆర్ ప్ర‌మోష‌న్స్ కోసం బ‌రిలోకి దిగ‌బోతున్న స‌ల్మాన్.. ఇక అంచనాలు పీక్స్‌కి

RRR: ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం `ఆర్.ఆర్.ఆర్` జనవరి 7న‌ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం 1000 కోట్ల టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి రాబోతుంది. మరి ఇలాంటి చిత్రాన్ని ఏ రేంజ్ లో ప్రమోట్ చేయాలి. ఇందుకోసం అన్ని భాష‌ల నుండి బ‌డా బాబుల‌ని రంగంలోకి దింపాలి. ఇప్పుడిదే ప్లాన్ చేస్తున్నారు మేక‌ర్స్.

TheNewsQube-
SAlam is ready to rrr pomotion
SAlam is ready to rrr pomotion

దర్శక దిగ్గజం రాజమౌళి ముంబైలో తాజాగా సల్మాన్ ను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అసలు వీరిద్దరూ ఎందుకు కలిశారు ? సల్మాన్ ను రాజమౌళి ప్రత్యేకంగా కలవడానికి అసలు కారణం ఏంటి ? అనే విషయంపై టాలీవుడ్ లో చర్చ నడుస్తోంది. రాజమౌళి ప్రస్తుతం తన తాజా చిత్రం “ఆర్ఆర్ఆర్” ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు.

సినిమా పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్ పనుల్లో ముంబైలో బిజీగా ఉన్నాడు. ఈరోజు రాజమౌళి ముంబైలో సల్మాన్ సినిమా సెట్స్ లో కలిశారు. సల్మాన్‌, రాజమౌళి గంటకు పైగా సీరియస్‌గా చర్చించుకున్నారని ముంబై మీడియా చెబుతోంది. అందుకే ప్రతి ఒక్కరూ సమావేశం దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు.

స‌ల్మాన్ ఖాన్ కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో `భజరంగి భాయిజాన్` చిత్రాన్ని తెరకెక్కించే అవకాశం ముందుగా జక్కన్నకే దక్కింది. విజయేంద్ర ప్రసాద్ రచించిన కథకి కుమారుడు రాజమౌళి దర్శకత్వం వహించాలని ఆయన ఎంతగానో ఆశపడ్డారు. కానీ ఆ సమయంలో రాజమౌళి `బాహుబలి` షూటింగ్ లో బిజీగా ఉండటంతో ఆ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించారు.

SAlam is ready to rrr pomotion1
SAlam is ready to rrr pomotion1

ఆ తర్వాత ఆ చిత్రాన్ని కబీర్ ఖాన్ దర్శకత్వం వహించి బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఇప్పుడు సల్మాన్ తో ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్ మాత్రమేనా తదుపరి సినిమాకి కాల్షీట్లు కూడా అడిగేస్తారా? అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.