salaar : స‌లార్‌లో ప్ర‌భాస్ లుక్ లీక్.. ఆందోళ‌న‌లో నిర్మాత‌లు

salaar : సినిమా ఇండ‌స్ట్రీని లీకేజులు ఎంత‌గా బాధిస్తున్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ముఖ్యంగా భారీ బ‌డ్జెట్ సినిమాల‌ని ఎంతో జాగ్ర‌త్త‌గా షూట్ చేస్తున్న‌ప్ప‌టికీ, మూవీ నుండి ఫొటోనో లేదంటే వీడియోనో బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. లీకేజ్ రాయుళ్ళు చేస్తున్న ఈ ర‌చ్చ‌కు నిర్మాత‌లు బ‌లైపోతున్నారు. ఎన్నో కోట్లు ఖ‌ర్చుపెట్టి సినిమాలు చేస్తుంటే లీకేజ్ రాయుళ్ళు ఇలా లీకులు చేయ‌డం ఏం బాగోలేదంటూ చిత్ర బృందం గ‌గ్గోలు పెడుతున్నారు. తాజాగా ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్న ప్రభాస్ చిత్రం స‌లార్‌కు సంబంధించి కొన్ని వీడియోలు బ‌య‌ట‌కు రాగా, ఇవి సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఇందులో ప్ర‌భాస్ లుక్ ఫ్యాన్స్‌కు తెగ ఆనందాన్ని క‌లిగిస్తుంది.

తెలంగాణలోని గోదావరి ఖనిలో ప్ర‌స్తుతం స‌లార్ షూటింగ్ జ‌రుగుతుంది. ఆ ప్రాంత ప్ర‌జ‌లు ఇటీవ‌ల ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం పలికారు. ప్ర‌స్తుతం యాక్ష‌న్ స‌న్నివేశాల‌లో ప్ర‌భాస్ పాల్గొంటుండగా, ఆ స‌న్నివేశాలకు సంబంధించిన కొన్ని క్లిప్స్ బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఇందులో ప్ర‌భాస్ ని చూసిన ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. ఈ లుక్ చూస్తుంటే బాక్సాఫీస్‌ని ప్ర‌భాస్ షేక్ చేయ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తుంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటించనుందని మేక‌ర్స్ ఇటీవ‌ల అధికారిక ప్రకటన చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ కేటాయించి హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ ఈ ‘సలార్’ సినిమాను నిర్మిస్తోంది.

పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న ఈ సినిమాను ఓ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇందులో విలన్ రోల్‌లో మరో స్టార్ హీరో మోహన్‌లాల్ కనిపించనున్నారని స‌మాచారం. కేజీఎఫ్ చాప్ట‌ర్‌1తో సంచ‌ల‌నాలు సృష్టించిన ప్ర‌శాంత్ నీల్‌ కేజీఎఫ్ 2 చిత్రంతో ఇంకాస్త అంచ‌నాలు పెంచారు. ఇప్పుడు ప్రభాస్‌తో ఎలాంటి అంచ‌న‌లు పెంచుతాడో చూడాలి. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలింస్ ఈ సినిమాను నిర్మిస్తుండ‌గా, ఈ చిత్రంలో ప్ర‌భాస్ కింగ్ మేక‌ర్‌గా క‌నిపించ‌నున్నారు. ఈ సినిమా త‌ర్వాత ఆది పురుష్‌, నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న సినిమాతో బిజీ కానున్నాడు ప్ర‌భాస్.

 

 

Advertisement