Prabhas : ‘ఆదిపురుష్‌’ తో కలిసి రాబోతున్న ‘సలార్‌’

NQ Staff - May 26, 2023 / 09:06 PM IST

Prabhas : ‘ఆదిపురుష్‌’ తో కలిసి రాబోతున్న ‘సలార్‌’

Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన.. రూపొందుతున్న సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. మొదటగా ఆదిపురుష్ సినిమా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరో మూడు వారాల్లో ఆదిపురుష్‌ సినిమా విడుదలకు ముహూర్తం ఖరారు అయ్యింది.

ఆదిపురుష్ సినిమా విడుదల కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదిపురుష్ సినిమాకు వెళ్లిన ప్రభాస్ అభిమానులను సర్‌ ప్రైజ్ చేసేందుకు గాను సలార్‌ సినిమా యొక్క టీజర్‌ ను విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

కేజీఎఫ్‌ దర్శకుడు ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్‌ యొక్క షూటింగ్‌ ముగింపు దశకు వచ్చింది. సినిమాను కచ్చితంగా సెప్టెంబర్‌ లో సినిమా యొక్క షూటింగ్ ను ముగించాలని భావిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

సలార్‌ సినిమా యొక్క టీజర్ ను విడుదల చేసి ఆదిపురుష్‌ యొక్క థియేట్రికల్‌ ప్రింట్‌ తో ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో కూడా విడుదల చేయాలని నిర్ణయించారు. అందుకు గాను సలార్ మేకర్‌ ప్రశాంత్‌ నీల్‌ ఏర్పాట్లు చేస్తున్నాడు. అదే జరిగితే ప్రభాస్ అభిమానులకు సర్‌ ప్రైజ్ ఖాయం.. అలాగే డబుల్‌ ధమాకా ఖాయం.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us