Salaar : సలార్ స్టోరీ లీక్ : చదువుతుంటే నే వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి .

Salaar : సలార్..ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియన్ స్టార్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా. తాజాగా ఈ సినిమా షూటింగ్ రామగుండం కోల్ మైన్స్ లో మొదలైంది. ప్రస్తుతం మన ప్రభాస్ యంగ్ డైరెక్టర్ జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాధే శ్యామ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. 1920 కాలంలో ఇటలీ నేపథ్యంలో సాగే రొమాంటిక్ పీరియాడికల్ సినిమాగా దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. గోపీకృష్ణ మూవీస్ – యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతోంది.

salaar-story-leak-everyone-feels-goose-bumps-by-reading-it
salaar-story-leak-everyone-feels-goose-bumps-by-reading-it

కాగా ఈ సినిమా తర్వాత ప్రభాస్ వరుస పాన్ ఇండియన్ ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు. ‘కె.జి.ఎఫ్‌’ సినిమాతో దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌, నిర్మాత విజయ్‌ కిరంగందూర్‌ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ముఖ్యంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ సౌత్ సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి రేంజ్ లో పాన్ ఇండియన్ డైరెక్టర్ గా క్రేజ్ అండ్ పాపులారిటీని సంపాదించుకున్నాడు. దాంతో ఇప్పుడు ప్రశాంత్ నీల్ – ప్రభాస్ కాంబినేషన్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సలార్ మీద ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు ముఖ్య కారణం కేవలం సలార్ ని దర్శకుడు ప్రశాంత్ నీల్ 4 నెలల్లో పూర్తి చేస్తా అని వెల్లడించడమే.

Salaar : కేజీఎఫ్ 1 అండ్ 2 కంటే పదింతలు హై ఓల్టేజ్ తో ప్రభాస్ ఇంట్రడక్షన్స్ అండ్ క్లైమాక్స్ ఫైట్స్ ..!

అయితే ఇప్పుడు సలార్ లో ఉన్న యాక్షన్ సీక్వెన్స్ గురించే ఇండస్ట్రీ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చలు సాగుతున్నాయి. ఒక్కో యాక్షన్ ఎపిసోడ్ కి భారీ బడ్జెట్ ని కేటాయిస్తున్నారని సమాచారం. ఫస్ట్ హాఫ్ లో మూడు .. సెకండాఫ్ లో మూడు భారీ యాక్షన్ సీన్స్ ని భారీ స్థాయిలో ప్రశాంత్ నీల్ తెరకెక్కించబోతున్నాడట. ఒకరకంగా ఈ యాక్షన్ సీన్స్ కేజీఎఫ్ 1 అండ్ 2 కంటే పదింతలు హై ఓల్టేజ్ తో ఉండబోతున్నాయని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ముఖ్యంగా సలార్ ప్రభాస్ ఇంట్రడక్షన్స్ అండ్ క్లైమాక్స్ ఫైట్స్ 15 నిముషాలు ఉంటుంటాయని కోట్ల లో ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే సలార్ కథ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో హై ఓల్టేజ్ డ్రామాగా రూపొందబోతుందని అర్థమవుతోంది.

Advertisement