Salaar : ప్రభాస్ ‘సలార్’కి పోటీగా.. మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’..
Kondala Rao - January 29, 2021 / 06:47 PM IST

Salaar : ప్రిన్స్ మహేశ్ బాబు చివరి సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ విడుదలై ఏడాది దాటింది. ఆయన నుంచి మరో మూవీ రావాలంటే ఇంకో ఏడాది వరకు ఆగక తప్పట్లేదు. ఎందుకంటే మహేశ్ బాబు ప్రస్తుతం నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ ఫిల్మ్ ని 2022 సంక్రాంతి బరిలో ఉంచుతున్నారు కాబట్టి. ఈ విషయాన్ని హీరో మహేశ్ బాబు ఇవాళ ట్విట్టర్ లో పెట్టాడు.
నాన్న బాటలో..
మహేశ్ బాబు ఫాదర్ సూపర్ స్టార్ కృష్ణ కూడా ఒకప్పుడు తన సినిమాలను సంక్రాంతి సీజన్ లోనే రిలీజ్ చేసి హిట్స్ కొట్టేవారు. దీంతో ఆయన్ని సంక్రాంతి హీరో అని కూడా అభిమానులు పిలిచేవారు. ఇప్పుడు ప్రిన్స్ కూడా తన తండ్రి బాటనే ఎంచుకున్నట్లు అర్థమవుతోంది. ‘సరిలేరు నీకెవ్వరు’ కూడా గతేడాది ఈ పండక్కే వచ్చి అలరించిన సంగతి తెలిసిందే.
పోస్టర్: Salaar
‘సర్కారు వారి పాట’ మూవీ విడుదల తేదీని తెలియజేస్తూ సినిమా యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. ఒక రింగుకి నలభయో యాభయో తాళాలు పెట్టుకొని, ఆ రింగుని హీరో మహేశ్ బాబు పట్టుకొని వెళుతున్నట్లున్న ఇమేజ్.. సినిమా మీద ఇంట్రస్ట్ ని రెట్టింపు చేస్తోంది. బ్యాంకులో జరిగే ఆర్థిక నేరాల చుట్టూ ఈ సినిమా తిరుగుతుందని చెబుతున్నారు. అందుకే బ్యాంకులోని లాకర్లను తెరవటానికి తాళాలు తీసుకెళుతున్నాడేమో అనిపిస్తోంది.
మూడు సంస్థలు..
‘సర్కారు వారి పాట’ మూవీని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సంస్థలు నిర్మిస్తుండటం విశేషం. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ కలిసి తెరకెక్కిస్తున్నాయి. ‘గీత గోవిందం’ చిత్రం తర్వాత డైరెక్టర్ పరశురామ్ దాదాపు మూడేళ్లు గ్యాప్ తీసుకొని దీన్ని రూపొందిస్తున్నాడు. ఇందులో మహేశ్ బాబుకు జోడీగా కీర్తి సురేష్ మెరవనుంది.

Salaar-sakaru-vari-pata-movies-are-at-a-time
దుబాయ్ లో: Salaar
‘సర్కారు వారి పాట’ ఫిల్మ్ రెగ్యులర్ షూటింగ్ ఈమధ్యే దుబాయ్ లో మొదలైందని చెబుతున్నారు. దీనికి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ‘సలార్’ మూవీని కూడా వచ్చే ఏడాది సంక్రాంతికే ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఈ రెండింటి మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లు సాగనుంది.