Salaar : RRR, KGF2లని మించిన డేట్ దొరికింది ప్రభాస్ సాలార్ కి.. ఆ రోజు రిలీజ్ అయితే బాక్స్ ఆఫీస్ సునామీ!

Salaar : మామూలు సీజన్ లో వచ్చే మూవీల కన్నా పండగ సమయంలో విడుదలయ్యే సినిమాలకే అభిమానుల అటెన్సన్, కలెక్షన్స్ ఎక్కువగా సొంతం చేసుకోవచ్చు. అందుకే పెద్ద పెద్ద హీరోలు చాలా వరకు ఫెస్టివల్స్ టైమ్ లోనే తమ సినిమాల రిలీజ్ లను ప్లాన్ చేసుకుంటారు. ముఖ్యంగా వెంకటేష్, బాలయ్య బాబు, నాగార్జున తదితర హీరోలు గతంలో ఇలా పక్కా ప్రణాళిక రచించి, అమలుచేసి సక్సెస్ లను ఖాతాల్లో వేసుకున్నారు. ఇప్పుడు ఇదే ట్రెండ్ ని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఫాలో కాబోతున్నాడు.

‘సలార్’తో..

‘కేజీఎఫ్’ డైరెక్టర్, ప్రభాస్ కాంబినేషన్ లో పెద్దఎత్తున రూపొందుతున్న చిత్రం ‘సలార్’. దీన్ని మొన్నే హైదరాబాద్ లో అఫిషియల్ గా లాంచ్ చేశారు. కాకపోతే షూటింగ్ ఎప్పుడు పూర్తి చేసి దీన్ని ప్రేక్షకుల ముందుకు తేవాలనే విషయంలో తర్జన భర్జనలు పడ్డారు. ఎట్టకేలకు వచ్చే ఏడాది సంక్రాంతి పండక్కి ‘సలార్’ని థియేటర్లలో దింపేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. దీన్నిబట్టి చూస్తే ఈ ఫిల్మ్ కోసం ఫ్యాన్స్ ఇంకా ఏడాది కాలం ఆగాల్సి ఉంటుంది. ఇది కొంచెం నిరాశ కలిగించే విషయమే అయినా తప్పట్లేదు.

ఎందుకు?: Salaar

‘సలార్’ చిత్రాన్ని వచ్చే ఏడాదికి ఎందుకు వాయిదా వేశారంటే.. 2021 సంవత్సరంలో ముఖ్యమైన సీజన్లన్నీ పెద్ద పెద్ద సినిమాలతో ముందే బుక్కయ్యాయి కాబట్టి. ఆ మూవీస్ లిస్టులో ప్రభాస్ వి కూడా రెండు ఉన్నాయి కాబట్టి. రాధేశ్యామ్ ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. ఔట్ పుట్ కూడా బాగా వచ్చిందని చెబుతున్నారు. దీన్ని ఈ ఏడాదే రిలీజ్ చేస్తారు. దీనికితోడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న అతి భారీ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ అక్టోబర్ 13న దసరా స్లాట్ ని లాక్ చేసేసింది.

Salaar-prabhas-film-will-release-next-year-only
Salaar-prabhas-film-will-release-next-year-only

మరిన్ని..

మెగాస్టార్ చిరంజీవి చిత్రం ఆచార్య, పవన్ కళ్యాణ్ మూవీ వకీల్ సాబ్, కేజీఎఫ్2తోపాటు ప్రభాస్ మరో సినిమా ఆదిపురుష్ కూడా ఈ సంవత్సరమే విడుదల కానున్నాయని చెబుతున్నారు. దీంతోపాటు దసరా అనంతరం దీపావళి నుంచి క్రిస్మస్, న్యూఇయర్ వరకు చాలా చిత్రాలు క్యూలో ఉన్నాయని, తప్పనిసరి పరిస్థితుల్లోనే ‘సలార్’ని 2022 స్టార్టింగులో విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. ఇవన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది ముగ్గుల పండక్కి ముగ్గులోకి దిగే ‘సలార్’ బాక్సాఫీసు వద్ద సునామీ రేపటం ఖాయమని ఆడియెన్స్ అశిస్తున్నారు.

Advertisement