Salaar : వరసగా 40 నిమిషాల ఫైట్ – ప్రభాస్ కోసం ‘సలార్’లో మైండ్ బ్లాకింగ్ యాక్షన్ !

Salaar : క్లాస్ పీపుల్ కి ఫైట్లు పెద్దగా నచ్చవేమో గానీ మాస్ ఫ్యాన్స్ కి మాత్రం అవి తప్పకుండా ఉండాల్సిందే. సినిమా మొత్తమ్మీద కనీసం రెండు మూడు సీన్లయినా ఇలాంటివి పెట్టకపోతే ఊరుకోరు. మరీ ముఖ్యంగా క్లైమ్యాక్స్ లో హైఓల్టేజీ ఫైట్ లేకపోతే అదో వెలితిగా ఫీలవుతారు. ఒకప్పుడు పెద్ద పెద్ద హీరోల సినిమాల్లో ఇదో హిట్ ఫార్ములా. ఆ ట్రెండ్ నే ఇప్పుడూ ఫాలో కాబోతున్నారంట.

అర్ధ గంట పైనే..

ప్రభాస్ ‘సలార్’ మూవీలో మైండ్ బ్లాకింగ్ ఫైట్ ఉండబోతోందని ఇండస్ట్రీ టాక్. అది కూడా ఏకంగా 40 నిమిషాల పాటు కంటిన్యూగా వీరోచితంగా ఉంటుందని ఫిల్మ్ సిటీ వర్గాలు చెబుతున్నాయి. అసలే యంగ్ రెబల్ స్టార్.. ఆపై భారీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా అంటున్నారు. కాబట్టి ఆ మాత్రం రోమాలు నిక్కరబొడిచే పోరాటం పెట్టకపోతే ఎలా? అని ప్రభాస్ ఫ్యాన్స్ అప్పుడే సపోర్ట్ చేయటం మొదలుపెట్టారు.

కోలార్ మైన్స్ లో: Salaar

సలార్’ని కేజీఎఫ్ క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ప్రేక్షకులు జేజేలు పలికిన ‘కేజీఎఫ్’ మూవీ స్టోరీని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్(కేజీఎఫ్)లో జరిగే ఇల్లీగల్ మైనింగ్ కార్యకలాపాల చుట్టూ తిప్పిన ఆయన ఇప్పుడు ‘సలార్’ని సింగరేణి సంస్థతో లింక్ చేయటం సంచలనం రేపుతోంది. ఖమ్మం జిల్లా గోదావరిఖని బొగ్గు గనుల ప్రాంతంలో కొన్ని ముఖ్యమైన సెట్టింగులు వేసి ఈ సినిమా తీస్తారంట. ఇది ప్రస్తుతం తెలంగాణలో తీవ్రంగా చర్చనీయాంశమవుతోంది.

Salaar-biggest-continuous-fight-in-prabhas-movie
Salaar-biggest-continuous-fight-in-prabhas-movie

రెడీ.. స్టార్ట్..

‘సలార్’ చిత్రాన్ని ఇటీవలే హైదరాబాద్ లో అఫిషియల్ గా లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. ‘కేజీఎఫ్’ని రూపొందించిన డైరెక్టరే ’కేజీఎఫ్2’ కూడా తెరకెక్కించాడు. ఆ ట్రైలర్ కూడా కేజీఎఫ్ రేంజ్ లోనే కొత్త కొత్త రికార్డులు నమోదు చేస్తోంది. ఈ నేపథ్యంలో ‘సలార్’ని సైతం ప్రభాస్ ఇమేజ్ కి ఏమాత్రం తగ్గని స్థాయిలో తీస్తాడనే అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ కి జోడీగా శృతిహాసన్ ని సెలెక్ట్ చేసినట్లు మూవీ యూనిట్ ఇవాళే లేటెస్టు అప్డేట్ కూడా ఇచ్చింది.

Advertisement