Sajjanar in Yuvaratna : సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ లేటెస్టుగా అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ)గా పదోన్నతి పొందిన విషయం తెలిసిందే. ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ) హోదాలో రెండున్నరేళ్ల పాటు పోలీస్ కమిషనర్ గా పని చేసిన ఆయన నాలుగు రోజుల కిందట ఏడీజీపీ హోదాలో బాధ్యతలు స్వీకరించారు. పదోన్నతి పొందిన సజ్జనార్ ని సీఎం కేసీఆర్ అభినందించారు. అయితే ఇప్పుడు సజ్జనార్ సార్ గురించి ఎందుకు చర్చ అనే డౌట్ రావొచ్చు. ఆయన్ని ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ అని కూడా చెప్పుకుంటూ ఉంటారు కదా. దిశా ఎన్ కౌంటర్, వరంగల్ ఎన్ కౌంటర్ల సమయంలో సజ్జనార్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. అయితే ఏంటి అనేదే కదా మీ ప్రశ్న?..

గన్నుతో ఆడుకుంటాడా?..
సజ్జనార్ సార్ ఎంత ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ అయితే మాత్రం ఆయన రోజూ గన్నుతో ఆడుకుంటాడా అనేదే నా ధర్మసందేహం. ఈ అనుమానం తీరాలంటే యువరత్న సినిమా చూడాల్సిందే. యువరత్న అంటే నందమూరి బాలకృష్ణ కాదు. పర్మిషన్ లేకుండా ఆయన పేరెత్తినా, ఫొటో/వీడియో తీసినా ఆయన అస్సలు ఒప్పుకోడని తెలుసు. కాబట్టి ఇంతకీ ఈ యువరత్న ఎవరంటే కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్. ఈయన హీరోగా నటించిన సినిమా పేరే యువరత్న. ఈ మూవీ ట్రైలర్ ని ఇవాళ శనివారం విడుదల చేశారు. అదిగో అందులో వస్తుంది సజ్జనార్ సార్ ప్రస్తావన. ‘‘ఆయన గన్ తో ఆడుకుంటే ఈయన మనతో ఆడుకుంటాడు’’ అనే ఒక డైలాగ్ ఈ ట్రైలర్ లో ఉంది. ఇలాంటి పంచ్ సంభాషణలు ఇందులో ఫుల్లుగా ఉన్నాయి.
బ్లాక్ బోర్డ్.. టోటల్ వరల్డ్: Sajjanar in Yuvaratna
క్లాస్ రూమ్ లో ఫస్ట్ బెంచ్ లో కూర్చుంటే బ్లాక్ బోర్డ్ మాత్రమే కనిపిస్తుంది.. అదే బ్యాక్ బెంచ్ లో కూర్చుంటే టోటల్ వరల్డ్ కనిపిస్తుంది.. అనే మరో డైలాగ్ కూడా ఈ ట్రైలర్ లో ఆకట్టుకుంటోంది. మొత్తమ్మీద విద్య వ్యాపారమయం కాకుండా అడ్డుకోవాలి అనే కాన్సెప్ట్ తో ఈ పిక్చర్ ని తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఈ ఫిల్మ్ ఏప్రిల్ ఒకటో తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది.