Tollywood : టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న సాయీ మంజ్రేకర్.. ఏ లిస్ట్‌లో చేరుతుంది..?

Tollywood : టాలీవుడ్‌కి బాలీవుడ్ హాట్ బ్యూటీస్ ఎంతమంది వస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ గతకొంత కాలంగా బాలీవుడ్ నుంచి వస్తున్న స్టార్ హీరోయిన్స్ ఎవరూ టాలీవుడ్‌లో సక్సస్ కావడం లేదు. ఒక సినిమా చేసి ముంబై ఫ్లైటెక్కేస్తున్నారు. సాహో సినిమాతో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ద కపూర్ గ్రాండ్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కానీ మన తెలుగు ప్రేక్షకులను శ్రద్ద కపూర్ మెప్పించలేకపోయింది. మళ్ళీ టాలీవుడ్ సినిమాలో అవకాశం రాలేదు. భరత్ అనే నేను సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన కియారా అద్వానీ మళ్ళీ టాలీవుడ్ సినిమాలకి డేట్స్ ఇవడం కుదరడం లేదు.

saiee-manjrekar-in-tollywood-industry
saiee-manjrekar-in-tollywood-industry

అంతగా బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. పూరి జగన్నాధ్ పరిచయం చేసిన దిశా పఠాని కూడా రెండవ సినిమా టాలీవుడ్‌లో చేయడం కాదు కదా అసలు టాలీవుడ్ మేకర్స్ పట్టించుకున్నది లేదు. ఇప్పుడు బాలీవుడ్ నుంచి దిగుమతి అవుతున్న మరో హాట్ బ్యూటీ ఏ లిస్ట్‌లో చేరుతుందన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దబాంగ్ సిరీస్ సినిమాతో సల్మాన్ ఖాన్ బాలీవుడ్‌కి పరిచయం చేసిన హీరోయిన్ సాయీ మంజ్రేకర్. బాలీవుడ్ స్టార్ నటుడు, దర్శకుడు మహేష్ మంజ్రేకర్ నట వారసురాలిగా పరిచయమైనప్పటికి టాలెంట్‌తో బాగా క్రేజీ హీరోయిన్ అయింది.

Tollywood : టాలీవుడ్‌లో సాయీ మంజ్రేకర్ హాట్ టాపిక్.. !

ఇప్పుడు ఒకేసారి రెండు సినిమాలతో టాలీవుడ్‌లో అడుగు పెట్టబోతోంది. టాలెంటెడ్ హీరో అడవి శేష్ టైటిల్ రోల్‌లో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ లైఫ్ స్టోరీని బయోపిక్ గా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగుతో పాటు మిగతా సౌత్ భాషల్లో విడుదల కాబోతుంది. ఈ సినిమాతో సాయి మంజ్రేకర్ టాలీవుడ్‌కి పరిచయం అవుతోంది. అలాగే వరుణ్ తేజ్ నటిస్తున్న గని సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలా వరుసగా రెండు సినిమాలతో రాబోతున్న సాయీ మంజ్రేకర్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్. మరి హిట్స్ అందుకొని ఇక్కడ స్టార్ హీరోయిన్ అవుతుందా లేదా చూడాలి.

Advertisement