SAI DHARAM TEJ: పులి పిల్ల‌ల‌తో మెగా హీరో స్పెష‌ల్ పిక్.. వైర‌ల్‌గా మారిన ఫొటో

SAI DHARAM TEJ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే మెగా హీరోల‌లో సాయి ధ‌ర‌మ్ తేజ్ ఒక‌రు. హిట్స్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న తేజ్ త్వ‌ర‌లో రిప‌బ్లిక్ అనే సినిమాతో ప‌ల‌క‌రించ‌నున్నాడు. ఈ సినిమాను దేవాక‌ట్టా తెర‌కెక్కించ‌గా, ఈ చిత్రం పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో రూపొందించిన‌ట్టు తెలుస్తుంది. క‌రోనా ఎఫెక్ట్ కాస్త త‌గ్గాక రిప‌బ్లిక్ సినిమాను థియేట‌ర్‌లో తీసుకొచ్చే ప్ర‌యత్నం చేస్తున్నారు మేక‌ర్స్ . అయితే తేజ్ సోషల్ మీడియాలో చాలా అరుదుగా వెరైటీ పోస్టులు పెడుతుంటాడు.


ఈ రోజు ఎర్త్‌డే సంద‌ర్భంగా పెట్ క‌బ్స్‌తో దిగిన ఫొటోని షేర్ చేశాడు. ఇందులో రెండు తెల్ల‌పులి పిల్ల‌లు త‌దేకంగా చూస్తున్న‌ట్టు క‌నిపిస్తుంది. మ‌రో ప‌క్క తేజ్ వాటిని చూసుకుంటూ కెమెరాకు ఫోజులిచ్చాడు. అయితే ఆ పులి పిల్ల‌ల పేర్లు ల‌య‌న‌ల్ లేరోయ్ లు అంటూ త‌న పోస్ట్‌లో పేర్కొన్నాడు. ప్రస్తుతం తేజ్ తో పాటు ఆ కబ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, రిపబ్లిక్ సినిమాలో ఫస్ట్ టైం తేజ్ కలెక్టర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తోంది. రమ్యకృష్ణ జగపతిబాబు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. జే భగవాన్ పుల్లారావు సినిమాను నిర్మిస్తున్నారు.

Advertisement