Sai Pallavi : సాయిపల్లవి ఆస్తులు ఎంతో తెలుసా.. స్టార్ హీరోయిన్లను మించిపోయిందిగా..!
NQ Staff - March 3, 2023 / 04:50 PM IST

Sai Pallavi : నేచురల్ బ్యూటీగా సౌత్ ఇండస్ట్రీ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది సాయిపల్లవి. చేసింది తక్కువ సినిమాలే అయినా ఆమె ముద్ర బలంగా పడేలా చూసుకుంది. మొదటి నుంచి సాయిపల్లవి అందాల ఆరబోతకు మాత్రం దూరంగానే ఉండేది. కేవలం నటనను మాత్రమే నమ్ముకుని పైకి వచ్చింది ఈ ముద్దుగుమ్మ. పైగా ఎలాంటి పాత్రలో అయినా సరే ఒదిగిపోతుంది.
సాయిపల్లవి నటనకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. పాత్రలో ఒదిగిపోయి ఎక్స్ ప్రెషన్లు ఇవ్వడంలో సాయిపల్లవి తర్వాతే ఎవరైనా. ఆ రేంజ్ లో ఆమె నటన ఉంటుంది. ఇక సాయిపల్లవి రీసెంట్ గా నటించిన సినిమాలు అన్నీ అట్టర్ ప్లాప్ అవుతున్నాయి. ఆమె ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించడంతో వాటి ఎఫెక్ట్ ఆమె మీద బలంగా బపడిపోయింది.
ఇండస్ట్రీకి దూరంగా..
అందుకే ఆమె లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఈ క్రమంలోనే ఆమె ఇండస్ట్రీకి దూరం అయిపోయింది. కాగా ఆమె ఆస్తులకు సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆమె ఒక్కో సినిమాకు రూ.2.5కోట్లు తీసుకుంటూ వస్తోంది.
ఇలా సినిమాల ద్వారా ఆమె బాగానే సంపాదించినట్టు తెలుస్తోంది. సాయిపల్లవి ఆస్తుల విలువ ఏకంగా రూ.29 కోట్ల రూపాయలు అని సమాచారం. సాయిపల్లవి త్వరలోనే మరో వెబ్ సిరీస్ తో మన ముందుకు రాబోతోందని తెలుస్తోంది. అది కూడ ఆమెకు లైప్ ఇచ్చిన శేఖర్ కమ్ముల దర్శకత్వంలోనే వస్తోందని సమాచారం.