Sai Pallavi Smokes Cigarette : నేను కూడా సిగరెట్ తాగాను.. సాయిపల్లవి షాకింగ్ కామెంట్లు..!
NQ Staff - July 3, 2023 / 11:27 AM IST

Sai Pallavi Smokes Cigarette :
సాయిపల్లవి అంటే అందరికీ ఓ క్లీన్ ఇమేజ్ ఉన్న హీరోయిన్ అని గుర్తుకు వస్తుంది. ఆమె ఇప్పటి వరకు చేసిన ఏ సినిమాలో అయినా సరే హద్దులు మీరలేదు. ఎలాంటి అందాలను ఎక్స్ పోజింగ్ చేయలేదు. లిప్ లాక్ లాంటివి కూడా చేయలేదు. అందుకే అందరూ ఆమెను విపరీతంగా అభిమానిస్తూ ఉంటారు.
తనకు పాత్ర నచ్చితేనే ఏ సినిమా అయినా చేస్తుంది. లేకపోతే అది ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే వదిలేస్తుంది. అలా ఆమె ఇప్పటి వరకు చాలామంది స్టార్ హీరోల సినిమాలు వదిలేసింది. ఎలాంటి చెడు అలవాట్లు లేని సాయిపల్లవి సడెన్ గా షాకింగ్ కామెంట్లు చేసింది. తాను కూడా సిగరెట్ తాగానని వెల్లడించింది.
కాలేజీ రోజుల్లో..
అసలు మ్యాటర్ ఏంటో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. నేను గతంలో ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు మా కాలేజీలో పొగతాగడం మీద ఓ అవగామన సభ జరిగింది. అందులో నేను కూడా పాల్గొన్నాను. ఒక మనిషి ఆరోగ్యాన్ని ధూమపానం ఎంతలా దెబ్బ తీస్తుందో చెప్పే టాస్క్ లో నేను నటించాను.
అందులో డమ్మీ సిగరెట్ తాగాల్సి వచ్చింది. నేను అది సక్సెస్ ఫుల్ గా చేసి చూపించాను. ఆ టాస్క్ లో నా నటనకు అంతా మెచ్చుకున్నారు. అప్పటి నుంచే నాకు నటన మీద ఆసక్తి కలిగింది అంటూ చెప్పుకొచ్చింది సాయిపల్లవి. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.