Sai Pallavi : సాయి ప‌ల్ల‌వి సోద‌రి కూడా ఇక సినిమాల‌లో క‌నిపించ‌నుందా.. !

Sai Pallavi : యాక్టింగ్ తోపాటు నెమలిలా నాట్యం చేయడం సాయి పల్లవికి మాత్రమే చెల్లుతుంది. ఆమె ముందు హీరోలు కూడా తక్కువైపోతుంటారు.సాయిపల్లవికి తెలుగులో అభిమానులు చాలానే ఉన్నారు. సినిమాల్లోని ప్రదర్శన ద్వారానే కాకుండా ఆమె యాటిట్యూడ్, ప్రవర్తన, మాట తీరుకు అభిమానులున్నారు. రీసెంట్‌గా ల‌వ్ స్టోరీ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించింది ఈ ముద్దుగుమ్మ‌.

TheNewsQube-
Sai Pallavi sister pooja movies entry
Sai Pallavi sister pooja movies entry

సాయి ప‌ల్లవి సోద‌రి పూజా కణ్ణన్‌.. అచ్చంగా అక్కలానే ఉంటారు. అక్కలానే మంచి డ్యాన్సర్‌ కూడా. అక్క బాటలో చెల్లెలు కూడా కథానాయిక కానుందని కోన్నాళ్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ‘యమదొంగ’, ‘ఏ మాయ చేశావె’, ‘2.0’, ‘మాస్టర్‌’… ఇలా పలు చిత్రాలకు స్టంట్‌ మాస్టర్‌గా చేసిన స్టంట్‌ శివ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ద్వారా పూజా కణ్ణన్‌ కథానాయికగా పరిచయం కానున్నారని ఇటీవ‌ల వార్తలు వ‌చ్చాయి.

Sai Pallavi sister pooja movies entry
Sai Pallavi sister pooja movies entry

తాజాగా పూజా కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. స్టంట్ డైరెక్టర్ సిల్వ దర్శకుడిగా మారి చిత్తారాయి సెవ్వనం అనే సినిమాను తీశాడు. దీంట్లో సముద్రఖని, పూజా కన్నన్ ప్రముఖ పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా సముద్రఖని, పూజా కన్నన్ మీద పోస్టర్‌ను వదిలారు.

అయితే ఈ చిత్రం నేరుగా ఓటీటీలోకి వెళ్లోబోతోంది. డిసెంబర్ 3న జీ5లో ఈ చిత్రం రాబోతోందని ప్రకటించారు. మొత్తానికి సాయి పల్లవిలా పూజా కన్నన్ కూడా అందరినీ మెప్పిస్తుందేమో చూడాలి. కాగా, ప్రస్తుతం సాయి పల్లవి.. నాచురల్ స్టార్ నాని సరసన శ్యామ్ సింగరాయ్ మూవీ.. అటు రానాతో విరాట పర్వం మూవీ చేస్తుంది.

సాయి ప‌ల్ల‌వికి బాలీవుడ్ నుంచి కబురు వచ్చినట్లు తెలుస్తుంది. ఓ ప్రముఖ బ్యానర్ లో రానున్న మూవీలో నటించాలంటూ ఆమెకు ఆఫర్ వచ్చినట్లుగా టాక్.ఇందుకు సాయిపల్లవి నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లుగా తెలుస్తోంది.