Sai Pallavi Sister: సారంగ‌ద‌రియా పాట‌కు సాయి ప‌ల్ల‌వి సోద‌రి డ్యాన్స్.. అవాక్కైన ల‌వ్ స్టోరీ బ్యూటీ

Sai Pallavi Sister: మ‌ల‌యాళ బ్యూటీ సాయి ప‌ల్ల‌వి గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకుల్నీ కట్టిపడేసింది. ఆ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడుతూ అదరగొట్టింది.పాత్రకు తగ్గట్లు హావ భావాలను చక్కగా ప్రదర్శించగల భామగా పేరు తెచ్చుకుంది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూనే ప్రేక్షకులకు దగ్గరవడం ఆమెకు మాత్రమే చెల్లింది.

Sai Pallavi Sister Dancing for Saranga Dariya Song
Sai Pallavi Sister Dancing for Saranga Dariya Song

ఇప్పుడు ల‌వ్ స్టోరీ చిత్రంతో మ‌రింతగా అల‌రించింది.ఇందులోకూడా సాయి ప‌ల్ల‌వి త‌న అద్భుత‌మైన ప‌ర్‌ఫార్మెన్స్‌తో అద‌ర‌గొట్టింది.ఈ చిత్రంలోని సారంగ‌ద‌రియా పాట‌కు సాయి ప‌ల్లవి చేసిన డ్యాన్స్ హైలైట్‌గా నిలిచింది. ఈ పాట‌ను ప్ర‌తి ఒక్క‌రు త‌మ‌దైన స్టైల్‌లో చేసి నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో అల‌రించారు. సాయి పల్లవి చెల్లెలు పూజా కూడా ఈ పాట‌కు డ్యాన్స్ చేయ‌గా, ఇది చూసి సాయి ప‌ల్లవి మురిసిపోయింది.

Sai Pallavi Sister Dancing for Saranga Dariya Song
Sai Pallavi Sister Dancing for Saranga Dariya Song

పూజా కూడా సాయి పల్లవిలా మంచి డ్యాన్సర్. అంతేకాదు అచ్చం అక్కలానే ఉంటుంది. అక్కలానే మంచి డ్యాన్సర్‌ కూడా. ఆమె స్టంట్ కొరియో గ్రాఫర్ స్టంట్‌ శివ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తూ తెరకెక్కిస్తోన్న సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైనట్లు సమాచారం. ఇక సాయి పల్లవి సినిమాల విషయానికి వస్తే.. ఆమె ప్రస్తుతం ‘విరాట పర్వం’ లో నటిస్తోంది. తెలంగాణ నేపథ్యంలో పీరియాడికల్‌ ప్రేమకథగా, రాజకీయ థ్రిల్లర్‌గా వస్తోంది.

ల‌వ్ స్టోరీలో సాయి ప‌ల్ల‌వి న‌ట‌న‌, డ్యాన్స్ పై ప్ర‌శంస‌లు కురిపించిన విష‌యం తెలిసిందే. సాయిపల్లవి అద్భుత నటనను కనబరిచిందని ట్వీట్ చేస్తూ.. ‘ఎప్పటి లాగే సాయి పల్లవి సన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. అసలు ఆమెకు ఎముకలు ఉన్నాయా? స్క్రీన్‌పై ఎవరూ ఇలా డ్యాన్స్‌ చేయడం ఇంతవరకు చూడలేదు’ అంటూ మ‌హేష్‌ పేర్కొన్నారు. దీనికి సాయి ప‌ల్ల‌వి క్యూట్ కామెంట్ పెట్టింది.