Sai Pallavi: లవ్ స్టోరీ ఇంటర్వ్యూ.. చిరంజీవి సినిమాకు నో చెప్పడానికి కారణం చెప్పిన సాయి పల్లవి

Sai Pallavi: నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రలలో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రం లవ్ స్టోరీ. సెప్టెంబర్ 24న విడుదల కానున్న ఈ సినిమా రెట్టింపు అంచనాలు పెంచేసుకుంది. చిరంజీవి, ఆమీర్ ఖాన్ వంటి పెద్ద హీరోలు ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరు కాగా, అందరి దృష్టి ఈ సినిమాపైనే పడింది.

Sai Pallavi Response over Rejecting Movie with Chiranjeevi
Sai Pallavi Response over Rejecting Movie with Chiranjeevi

లవ్ స్టోరీ మూవీ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన సాయి పల్లవి.. లవ్ స్టోరి స్క్రిప్టు శేఖర్ కమ్ముల నాకు పంపారు. అది చదివిన తర్వాత వెంటనే ఈ సినిమా చేయాలనే ఫీలింగ్ కలిగింది. ఆయన ఫోన్ చేసి కథ నచ్చిందా అని అడిగి వెంటనే ఒప్పేసుకొన్నాను. లవ్ స్టోరి సినిమాలో నేను భాగమయ్యాను.
Sai Pallavi Response over Rejecting Movie with Chiranjeevi
Sai Pallavi Response over Rejecting Movie with Chiranjeevi

లవ్ స్టోరి ఆడ, మగ మధ్య తారతమ్యాల గురించి చర్చించే చిత్రం. లవ్ స్టోరిలో జెండర్ ఇష్యూస్ అనేది ఒక పాయింట్ మాత్రమే. సెట్‌లో ఆడ, మగ అనే తేడా కనిపించదు. స్క్రిప్టు డిమాండ్ మేరకు నాగచైతన్య, ఈశ్వరీరావు, నేను అంతా కలిసి చేశాం. ఇండస్ట్రీలో అలాంటి నటీనటులు మధ్య డిఫరెన్సెస్, వివక్ష కనిపించవు అని సాయిపల్లవి అన్నారు.

డ్యాన్స్, ప్రేమ అనే అంశాలు కథతోపాటు ట్రావెల్ అవుతాయి. అంతేకానీ డ్యాన్స్ బేస్డ్ సినిమా కాదు. ఈ చిత్రంలో పాత్ర నుంచి, శేఖర్ కమ్ముల నుంచి చాలా నేర్చుకొన్నాను. భానుమతి, మౌనిక పాత్రలు వేర్వేరు. ఫిదా తర్వాత ఇలాంటి పాత్రలు, తెలంగాణ యాస మాట్లాడటం చాలా ఈజీ అయింది అని సాయి పల్లవి చెప్పారు.

నాగచైతన్యతో చాలా కంఫర్ట్ ఉంది.. నాగచైతన్యతో నటించడం చాలా హ్యపీగా ఉంది. మా పాత్రల పరంగా ఒకరికొకరం సహకరించుకొన్నాం. నాగచైతన్య ఇచ్చిన సహకారం చాలా బాగుంది. నేను చేసిన సీన్లకు మంచి కాంప్లిమెంట్ ఇచ్చేవారు. ఆఫ్ స్క్రీన్ విషయానికి వస్తే.. షాట్స్ తర్వాత సన్నివేశాల మధ్య చాలా కూల్‌గా కనిపించేవాడు. ఎప్పుడు నాకు ప్రిఫరెన్స్ ఇచ్చేవారు. చాలా స్వీట్ పర్సన్.

సమాజంపై సినిమాల ప్రభావం గురించి సినిమాల వల్ల ప్రభావం చెందుతారంటే నేను కచ్చితంగా చెప్పలేను. కానీ కొంత మేరకు ప్రభావం ఉంటుంది. ఈ సినిమాలో సమాజంలో ఉన్న కొన్ని వివక్షలను ఈ సినిమా మేకర్స్ సృజనాత్మకంగా ప్రశ్నించే ప్రయత్నం చేశారు. కొన్ని విషయాలు ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉంటాయి అని సాయిపల్లవి పేర్కొన్నారు.

కుల, లింగ వివక్ష అంశాలు మేలవించి లింగ, కుల వివక్ష గురించి లవ్ స్టోరి సినిమాలో చర్చించాం. అయితే నాకు ఎదురయ్యాయా అని అడిగే కంటే.. ఇలాంటి సమస్యను ఏ అమ్మాయికైనా జరగకుండా ఉంటాయా అని అడగాలి. నేను, నా తల్లి, నా సిస్టర్, ఎందరో మహిళలు సమాజంలో ఎదుర్కోవడం చాలా సాధారణంగా మారాయి.

చిరంజీవి సినిమా ఎందుకు రిజెక్ట్ చేశానంటే.. రీమేక్ చిత్రాలకు నేను వ్యతిరేకం కాను. ఏదైనా సినిమా ఒక భాషలో హిట్ అయినప్పుడు మరో భాష ప్రేక్షకులకు చూపించాలని రీమేక్ ద్వారా ప్రయత్నం చేస్తుంటారు. రీమేక్‌లో అప్పటికే ఒకరు చేసిన పాత్రను చేయాలంటే కొంత ఒత్తిడి ఉంటుంది. ఆ పాత్ర కంటే బెటర్ చేయాలనే ఒత్తిడి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఫ్రెష్‌గా చేస్తే నా వైపు నుంచి ఇంపాక్ట్ ఉంటుందనే ఫీలింగ్ నాకు అనిపిస్తుంది.

అందుకే నేను రీమేక్ పాత్రలకు కొంచెం దూరంగా ఉంటాను. లూసిఫర్ రీమేక్ చిత్రంలో చిరంజీవి ఆఫర్ రిజెక్ట్ చేయడం వెనుక మరే కారణం లేదు. నా వరకు పాత్ర గొప్పగా ఉండాలి అనుకొంటాను అని సాయిపల్లవి ఓ ప్రశ్నకు వివరణ ఇచ్చారు. తక్కువ సినిమాలు చేయడానికి కారణం కారణం ఏమీలేదు. నాకు నచ్చిన పాత్రలను, సినిమాలను ఎంపిక చేసుకొంటాను.

కొన్ని సార్లు కథను ఒకే చేసిన తర్వాత సెట్స్‌లో కథ మారిపోయిన సందర్భాలు ఉంటాయి. కానీ అవి మీనింగ్ ‌ఫుల్‌గా ఉండేలా నేను చూసుకొంటాను. ఎక్కువ సినిమాలు చేయలేకపోతున్నాననే ఆందోళన ఏ మాత్రం లేదు అని సాయిపల్లవి చెప్పారు. శేఖర్ కమ్ములలో అంత నిజాయితీగా లవ్ స్టోరి లాంటి కమర్షియల్ చిత్ర కథకు సమాజంలోని క్లిష్టమైన అంశాలను శేఖర్ కమ్ముల జోడించిన తీరు గొప్పగా ఉంటుంది.