Manchu Vishnu: మంచు విష్ణు సినిమా కోసం భారీగా డిమాండ్ చేసిన సాయి ప‌ల్ల‌వి.. చేసేదేం లేక పాయ‌ల్‌ని ఓకే చేసిన మేక‌ర్స్

NQ Staff - March 10, 2022 / 10:58 PM IST

Manchu Vishnu: మంచు విష్ణు సినిమా కోసం భారీగా డిమాండ్ చేసిన సాయి ప‌ల్ల‌వి.. చేసేదేం లేక పాయ‌ల్‌ని ఓకే చేసిన మేక‌ర్స్

Manchu Vishnu: మా ప్రెసిడెంట్ మంచు విష్ణు చాలా రోజుల త‌ర్వాత సినిమా ఓకే చేసిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా షాన్ సూర్య ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుండ‌గా, మూవీకి గాలి నాగేశ్వ‌ర‌రావు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ క్యారెక్టర్ డిజైన్ చేసిన స్కెచ్ ని సోషల్ మీడియాలో మంచు విష్ణు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో పాయిల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.

Sai Pallavi Rejected Manchu Vishnu's Movie Offer

Sai Pallavi Rejected Manchu Vishnu’s Movie Offer


ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ స‌న్నీలియోన్ జాయిన్ అయింది. ఈ సినిమాలో రేణుక అనే పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్లు త‌న ఇన్స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది సన్నీ.ప్ర‌స్తుతం ఈసినిమా తిరుప‌తిలో షూటింగ్ జ‌రుగుతుంది. గ‌తంలో మంచు మ‌నోజ్ హీరోగా తెర‌కెక్కిన ‘క‌రెంట్ తీగ’ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది సన్నీలియెన్. ఈసారి మంచు విష్ణుతో రీ ఎంట్రీకి సిద్ద‌మైంది.

ఇందులో స‌న్నీ రోల్ కేవ‌లం గ్లామ‌ర్‌కే పరిమితం కాకుండా క‌థ‌ను మ‌లుపు తిప్పే విదంగా ఉంటుంద‌ట‌. ఈ సినిమాకి ప్ర‌ముఖ ర‌చ‌యిత‌, నిర్మాత కోన వెంక‌ట్ క‌థ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నాడు. అనూప్ రుబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. డా. మంచు మోహన్ బాబు ఆశీస్సులతో అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో విష్ణు మంచు హీరోగా ఈషాన్ సూర్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

కథ, స్ర్కీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు కోన వెంకట్. డాషింగ్ సినిమాటోగ్రాఫర్ చో టా.కె.నాయుడు కెమెరామ్యాన్ గా భాను, నందు డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చుతున్నారు. జి.నాగేశ్వరరెడ్డి మూల కథ అందించారు.

ముందుగా ఈ సినిమా కోసం క‌థానాయిక‌గా సాయి ప‌ల్ల‌విని అప్రోచ్ అయ్యారు. ఈ అమ్మడు రెండున్న‌ర కోట్లు డిమాండ్ చేయ‌డంతో చేసేదేం లేక చిత్ర బృందం పాయల్ రాజ్‌పుత్‌ని క‌థానాయిక‌గా ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తుంది. కాగా, సాయి ప‌ల్ల‌వి రీసెంట్‌గా ల‌వ్ స్టోరీ, శ్యామ్ సింగ‌రాయ్ చిత్రాల‌తో ప‌ల‌క‌రించిన విష‌యం తెలిసిందే.

Read Today's Latest గుసగుసలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us