Sai Pallavi : సాయిపల్లవికి డబ్బులిస్తే ఆ పని చేస్తుందా.. దండం పెట్టాల్సిందేరా బాబు..!
NQ Staff - January 19, 2023 / 12:04 PM IST

Sai Pallavi : ఈ జనరేషన్ సినిమా రంగం అంటేనే గ్లామర్‌కు పెట్టింది. ఇక్కడ నటన కన్నా కూడా గ్లామర్‌కు ఎక్కువగా ప్రియారిటీ ఇస్తున్నారు. అందాలు మొత్తం ఆరబోసే ముద్దుగుమ్మలకు వస్తున్న పాపులారిటీ మామూలుగా నటించే వారికి రావట్లేదు. కానీ అలాంటి వారి అంచనాలను తలకిందులు చేస్తూ.. అసలు ఎలాంటి అందాలను చూపించకపోయినా సరే అందరి కన్నా ఎక్కువ ఫాలోయింగ్ ను సంపాదించుకోవచ్చని నిరూపించింది సాయిపల్లవి.
ఆమె మొదటి నుంచి కేవలం నటనను మాత్రమే నమ్ముకుంది. ఇప్పటి వరకు ఎలాంటి అందాలను ఎక్స్ పోజింగ్ చేయలేదు. పైగా పాత్ర నచ్చకపోతే ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే రిజెక్ట్ చేస్తుంది. అందుకే ఆమెకు స్టార్ హీరోల సరసన పెద్దగా అవకాశాలు రావట్లేదు. ఇక రీసెంట్ గా ఆమె నటించిన సినిమాలు అన్నీ ప్లాప్ అవుతున్నాయి.
ఆ సినిమాలు ప్లాప్..
ఆమె చేసిన లేడీ ఓరియెంటెడ్ మూవీలు అన్నీ అట్టర్ ప్లాప్ అయ్యాయి. దాంతో ఆమె సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం ఇంటి దగ్గరే ఉంటుంది. ఇదిలా ఉండగా ఇప్పుడు ఆమెకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఆమెకు సినిమాల్లో నటించినందుకు నిర్మాతలు ఇచ్చిన చెక్కులను ముందుగా సాయిబాబా దగ్గర పెట్టి పూజ చేస్తుందంట. ఆ తర్వాత ఆ చెక్కులను తీసుకెళ్లి అమ్మానాన్నలకు ఇచ్చేస్తుందంట సాయిపల్లవి. అంతే గానీ తనకోసం ఏమీ దాచుకోదంట. ఈ విషయం తెలిసి ఆమె అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.