పవన్ కళ్యాణ్ సరసన సాయి పల్లవి ?
Admin - October 30, 2020 / 06:20 PM IST

నటి సాయి పల్లవి ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకుల కు దగ్గరయింది. ఇక మొదటి సినిమానే మంచి బ్లాక్ బస్టర్ కావడంతో తెలుగు ఇండస్ట్రీలో వరుస సినీ అవకాశాలు వచ్చాయి. అయితే ఈ అమ్మడుకు పెద్ద హీరోలతో నటించే భాగ్యం మాత్రం రాలేదు. ఇక తాజాగా ఒక స్టార్ హీరోతో సాయి పల్లవికి నటించే అవకాశం వచ్చిందని తెలుస్తుంది. అయితే టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ సరసన సాయి పల్లవి కనిపించబోతుంది అని సినీవర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
అయితే మలయాళంలో హిట్ సినిమాగా నిలిచిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ చిత్రాన్ని పవన్ హీరోగా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ రీమేక్ కు సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో పవన్ సరసన పలువురు హీరోయిన్లను సంప్రదించారట. దాంట్లో సాయి పల్లవిని కూడా సంప్రదించారట. దీనితో సాయి పల్లవి నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
కానీ అధికారికంగా మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒకవైపు సాయి పల్లవి వరుస సినిమాలతో బిజీ గా ఉంది. ప్రస్తుతం నాగ చైతన్యకు జోడీగా ‘లవ్ స్టోరీ’ చిత్రంలోనూ, రానా సరసన ‘విరాటపర్వం’ చిత్రంలోనూ, అలాగే ‘శ్యామ్ సింగ రాయ్’లో నాని పక్కన సాయిపల్లవి నటిస్తుంది.