Sai Kumar: అట్ట‌హాసంగా సాయి కుమార్ ష‌ష్టి పూర్తి వేడుక‌.. ఈ వీడియో చూస్తే దిమ్మ‌తిర‌గ‌డం ఖాయం

Sai Kumar: టాలీవుడ్ విలక్షణ నటుడు, డైలాగ్ కింగ్ సాయి కుమార్ 60వ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఇటీవ‌ల ఆయ‌న ష‌ష్టి పూర్తి వేడుకలు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ వేడుక చిన్న‌పాటి పెళ్లి మాదిరిగానే జ‌రిగింది. కొద్ది రోజుల క్రితం ఫొటోలు బ‌య‌ట‌కు రాగా, కొద్ది మంది సెల‌బ్స్ మాత్ర‌మే హాజ‌రు అయ్యార‌ని భావించారు. కాని తాజాగా విడుద‌లైన వీడియో చూస్తే ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌ముఖులు అంద‌రు దాదాపు అటెండ్ అయిన‌ట్టు తెలుస్తుంది.

చిరంజీవి, వెంక‌టేష్‌, రాజ‌శేఖ‌ర్, ప్ర‌కాశ్ రాజ్, జీవిత‌, ఆలీ, నాగ‌బాబు, ర‌ఘుబాబు, సురేష్ కొండేటితో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు వేడుక‌లో సంద‌డి చేశారు. తాజ‌గా సాయి కుమార్ త‌న‌యుడు ఆది ష‌ష్టి పూర్తి వేడుక‌కు సంబంధించిన స్మాల్ వీడియో ఒక‌టి రిలీజ్ చేశాడు. ఈ వీడియా చూస్తే ష‌ష్టి పూర్తి వేడుక ఎంత ఘ‌నంగా జ‌రిగిందో అర్ధ‌మ‌వుతుంది. పెళ్లి మాదిరిగానే ష‌ష్టి పూర్తిక వేడుక నిర్వ‌హించారు.త‌లంబ్రాలు, ఉంగ‌రాలు తీయ‌డం, ఇలా పెళ్లికి సంబంధించిన ఘ‌ట్టాలు అన్ని జ‌రిగాయి.

ఈ వీడియోని చూసి అందరు అవాక్క‌వుతున్నారు. డబ్బింగ్‌తో కెరీర్ మొదలుపెట్టినా కూడా బాల్యనటుడిగా, సపోర్టింగ్ రోల్స్ చేస్తూ హీరోగా ఎదిగారు. సాయి కుమార్ ఫ్యామిలీ మెన్‌గానూ మంచి పేరు తెచ్చుకున్నారు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీకి మాత్రం వీలైనంత సమయాన్ని కేటాయించేవారు. సాయి కుమార్ తండ్రి పీజే శర్మ గురించి టాలీవుడ్‌లో అందరికీ తెలిసిందే. ఆయను కుమారులుగా సాయి కుమార్, రవి శంకర్, అయ్యప్ప శర్మ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.

ఇప్పటికీ నటుడిగా సాయి కుమార్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇక బుల్లితెరపైనా సాయి కుమార్ హోస్ట్‌గా రాణిస్తున్నారు. బుల్లితెరపై వావ్ షోలో అసలు సందడి చేస్తున్నారు. సాయికుమార్‌ నటుడు పి.జె.శర్మ , కృష్ణ జ్యోతి దంపతులకు మొదటి కుమారుడు.. జూలై 27, 1960న చెన్నై లో జన్మించాడు. అక్కడే పెరిగాడు.. తండ్రి పిజె శర్మ డబ్బింగ్ కళాకారుడు, నటుడు కావడంతో సాయి కుమార్ బాల్యం నుంచే సినీ పరిశ్రమపై అనుబంధం ఏర్పడింది.