Sai Dharam Tej: వెంటిలేట‌ర్ తొల‌గించిన వైద్యులు.. మ‌రి కొద్ది రోజులు ఆసుప‌త్రిలోనే మెగా హీరో

Sai Dharam Tej: కొద్ది రోజుల క్రితం సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఐకియా-కేబుల్‌బ్రిడ్జ్ దాటిన త‌ర్వాత మైండ్‌స్పేస్ జంక్ష‌న్ ప్రాంతంలో సాయితేజ్ ప్ర‌యాణిస్తున్న బైక్ స్కిడ్ అయ్యింది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అక్కడ ఉన్నవాళ్లు ఆయన్ని మెడికోవర్ ఆస్పత్రిలో చేర్చారు.

Sai Dharam Tej Shifted from Ventilator
Sai Dharam Tej Shifted from Ventilator

మెరుగై వైద్యం కోసం అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయన కాలర్ బోన్ విరిగినట్లు గుర్తించిన వైద్యులు ఆయనకు విజయవంతంగా శస్త చికిత్స చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. అయితే వెంటిలేటర్‌ అవసరం తగ్గడంతో తొలగించినట్లు చెప్పిన హాస్పిటల్ యాజమాన్యం.. శరీరంలోని ముఖ్య భాగాలన్నీ బాగానే పనిచేస్తున్నట్లు తెలిపారు.

సాయి ధ‌ర‌మ్ తేజ్ స్పృహ‌లోకి వ‌చ్చాడ‌ని, తనంతట తానే సాయిధరమ్ తేజ్ శ్వాస తీసుకుంటున్నట్లు చెప్పిన డాక్టర్లు.. మరికొంతకాలం వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. సాయి ధ‌ర‌మ్ తేజ్ న‌టించిన రిప‌బ్లిక్ అక్టోబ‌ర్ 1న విడుద‌ల కానుండ‌గా, ఈ సినిమాపై అనేక వార్త‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో రమ్యకృష్ణ, జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు.