SaiI Dharam Tej: నిల‌క‌డ‌గా సాయి తేజ్ ఆరోగ్యం.. హెల్త్ బులిటెన్ విడుద‌ల చేసిన వైద్యులు

SaiI Dharam Tej: మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌ సెప్టెంబర్‌ 10 (శుక్రవారం) రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. తీగల వంతెన నుంచి ఐకియా స్టోర్‌ వైపు వెళుతోన్న సమయంలో తేజ్‌ నడుపుతోన్న బైక్‌ స్కిడ్‌ కావడంతో ఒక్కసారిగా రోడ్డుపై జారుతూ వెల్లిపోయారు తేజ్‌. వెంట‌నే ఆయ‌న‌ని ద‌గ్గ‌ర‌లోని మెడికోవ‌ర్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

Sai Dharam Tej Latest Health bulletin
Sai Dharam Tej Latest Health bulletin

తేజ్ కంటిపై భాగానికి, ఛాతికి, కాలికి గాయాలయ్యాయి. తేజ్‌ని మెడికోవ‌ర్ నుండి అపోలో ఆసుప‌త్రికి త‌ర‌లించిన వైద్యులు కాల‌ర్ బోన్ సర్జరీ చేశారు వైద్యులు . అయితే ఆయ‌న ప్ర‌స్తుతం లైవ్ స‌పోర్ట్‌పైనే ఉండ‌గా, మెగా నటుడు ఆరోగ్యం పూర్తి స్థాయిలో మెరుగయ్యేంత వరకు కూడా ఐసీయూలోనే ఉంచాలని అనుకుంటున్నారట. తేజూ ఆరోగ్యంకి సంబంధించి ప్ర‌తి రోజు అపోలో వైద్యులు హెల్త్ బులిటెన్ విడుద‌ల చేస్తూ వ‌స్తున్నారు.

తాజాగా విడుద‌ల చేసిన బులిటెన్‌లో సాయితేజ్ ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉందిని తెలియ‌జేశారు. అలానే అత‌ను శ్వాస తీసుకుంటున్నాడ‌ని, అవ‌య‌వాల ప‌నితీరు కూడా బాగుంద‌ని చెప్పారు. టెస్ట్‌లు కూడా అన్నీ స‌క్ర‌మంగానే ఉన్న‌ట్టు తెలియ‌జేశారు. ప్ర‌స్తుతం తేజ్ వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లోనే ఉన్నారు అని బులిటెన్‌లో తెలియ‌జేశారు.

Sai Dharam Tej Latest Health bulletin
Sai Dharam Tej Latest Health bulletin

సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై కూడా మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు వైద్యులకు ప్రత్యేకంగా ఫోన్ చేసి పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ఇక అభిమానులు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదని మొదటిరోజు నుంచి కూడా అపోలో వైద్యులు హెల్త్ విషయంపై అప్డేట్స్ ఇస్తున్నారు. తప్పకుండా సాయి త్వరగానే కొలుకుంటారని కూడా అన్నారు.

సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్ కూడా సాయి తేజ్ ఆరోగ్యంపై స్పందించాడు. సాయి ధరమ్ తేజ్ ను నంబన్ అంటూ సంబోధిస్తూ త్వరగా కోలుకుంటున్నాడు అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక తనకు గట్టి పట్టుదల ఉంది అని అన్నారు.