Sai Dharam tej Accident: రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ సాయి తేజ్.. అప‌స్మార‌క స్థితిలో మెగా హీరో

Sai Dharam tej Accident: మెగా హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డాడు. కేబుల్ బ్రిడ్జ్ ఫై స్పోర్ట్స్ బైకుపై వెళుతున్న స‌మ‌యంలో సాయి ధరమ్ తేజ్ అదుపు త‌ప్పి కింద ప‌డ్డాడు. దీంతో ఆయ‌నకు కుడి క‌న్ను పైన‌, ఛాతి, పొట్ట భాగంలో గాయాలు అయ్యాయి. ప్ర‌స్తుతం అప‌స్మార‌క స్థితిలో సాయి ధ‌ర‌మ్ తేజ్ ఉన్నారు.

Sai Dharam tej Accident at he was in Serious Condition
Sai Dharam tej Accident at he was in Serious Condition

మాదాపూర్ మెడికవర్ లో అడ్మిట్ అయిన సాయి ధరమ్ తేజ్‌కి సీటీ స్కాన్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యంఅంత విష‌మంగా లేద‌ని తెలుస్తుంది. ఆయ‌న స్పృహ‌లోకి వ‌చ్చిన‌ట్టు తెలుస్తుంది. ఏ స్థాయిలో దెబ్బ‌లు త‌గిలాయి, ఎంత సేపుకోమాలో ఉన్నారు, ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి ఏంట‌నే దానిపై మ‌రి కొద్ది క్ష‌ణాల‌లో క్లారిటీ రానుంది.

ప్రాణాపాయం అయితే లేద‌ని ఆయ‌న సన్నిహితులు అంటున్నారు. చివ‌రిగా సోలో బ్ర‌తుకే సో బెట‌ర్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సాయి ధ‌ర‌మ్ రీసెంట్‌గా రిప‌బ్లిక్ అనే సినిమా చేశాడు. ఈ చిత్రం అక్టోబ‌ర్ 1న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. దేవాకట్టా వంటి దర్శకుడితో సాయి ధరమ్ తేజ్ మూవీని ప్రకటించడంతోనే అంచనాలు పెరిగాయి. అయితే మధ్య మధ్యలో వదిలిన టీజర్లు, పోస్టర్లు బాగానే క్లిక్ అయ్యాయి.

చిత్రంలో జిల్లా కలెక్టర్‌గా పంజా అభిరామ్‌గా నటించబోతున్నాడు. జె భగవాన్, జె పుల్లారావ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే.