Seetha: సీనియర్ నటి సీత జీవితంలోని ఈ చీకటి కోణం మీకు తెలుసా..?

Seetha: ద‌క్షిణ భార‌తీయ న‌టి సీత గురించి తెలియ‌ని వారు ఉండ‌రు. ఆమె తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలలో పనిచేసింది. సీత 1985 లో హీరోయిన్ గా తన కెరీర్ ను ప్రారంభించింది. 1985 నుంచి 1990 దాకా ప్రముఖ కథానాయికల్లో ఒకటిగా కొనసాగింది. ఆడ‌దే ఆధారం చిత్రంతో నంది పుర‌స్కారం అందుకున్న సీత 2002లో మార‌న్ అనే త‌బ‌మిళ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది.

Sad Part of Actress Seetha Life Story
Sad Part of Actress Seetha Life Story

ఆడ‌దే ఆధారం, డ‌బ్బెవ‌ర‌కి చేదు, స‌గ‌టు మ‌నిషి, బ‌జారు రౌడీ, ముత్య‌మంత ముద్దు, పోలీస్ భార్య‌, ముద్దుల మావ‌య్య‌, చెవిలో పువ్వు వంటి సూప‌ర్ హిట్ చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చాలా ద‌గ్గ‌ర‌య్యారు సీత‌. పాత‌త‌రం ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించిన సీత వైవాహిక జీవితంలో ఫెయిల్ అయింది. త‌మిళ న‌టుడు పార్తీబ‌న్‌ని మొద‌టి సారి పెళ్లి చేసుకున్న సీత ఆ త‌ర్వాత సినిమాల‌కు దూర‌మైంది. వీరికి ఇద్ద‌రు బిడ్డలు ఉండ‌గా, ఓ అబ్బాయిని ద‌త్త‌త తీసుకున్నారు.

కొంత కాలం సంసారం త‌ర్వాత ఇద్ద‌రి మ‌ధ్య తీవ్ర విబేధాలు రావ‌డంతో 2001లో విడాకులు తీసుకున్నారు. ఇక మ‌ళ్లీ సినిమాలు చేయ‌డం ప్రారంభించింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా అనేక పాత్ర‌ల‌తో ఆక‌ట్టుకుంది. 2010లో టీవీ ఆర్టిస్ట్ స‌తీష్‌ని పెళ్లి చేసుకున్న సీత ఆరేండ్ల త‌ర్వాత అత‌నికి గుడ్ బై చెప్పింది.

చెన్నైలో పెట్టి పెరిగిన సీత త‌న కెరీర్‌లో బాగానే సక్సెస్ సాధించిన వైవాహిక జీవితంలో ఫెయిల్ అయింది. అయితే సీత తండ్రి త‌మిళ‌వాసి కాగా, త‌ల్లి తెలుగు మ‌హిళ‌. సీత తండ్రి మంచి న‌టుడు. ఎన్నో స్టేజ్ షోస్ చేశాడు. ఓ ఫ్రెండ్ ద‌ర్శ‌కుడు పాండ్య‌రాజా సినిమా చేస్తున్నాడు, అందులో క‌థానాయిక కోసం వెతుకుతున్నారు సీత‌ని హీరోయిన్‌గా పంపిచొచ్చు క‌దా అని చెప్ప‌డంతో ద‌ర్శ‌కుడి ద‌గ్గ‌ర‌కు సీత‌ని తీసుకెళ్లి క‌లిపించాడు సీత తండ్రి.

అణిపావ‌మ్ సినిమాతో హీరోయిన్‌గా రంగ‌ప్ర‌వేశం చేసిన సీత రాజా చంద్ర డైరెక్ష‌న్‌లో శోభ‌న్ బాబు హీరోగా వ‌చ్చిన విజృంభ‌ణ సినిమాతో తెలుగు ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టింది. సీత న‌టించిన రెండో చిత్రం డ‌బ్బెవ‌రికి చేదు . ఈ చిత్రం మంచి విజ‌యం సాధించ‌డంతో ఆమెకు వ‌ర‌స ఆఫ‌ర్స్ వ‌చ్చాయి.