Saami Saami Song : సామి సామి సాంగ్ కోసం నా రెండు గాజులు అమ్ముకున్నా: రేఖా భోజ్‌

Saami Saami Song : ప్ర‌స్తుతం టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్ లో పుష్ప చిత్రం ఒక‌టి. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్, ర‌ష్మిక ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. రెండు భాగాలుగా విడుదల కాబోతున్న ఈ మూవీ ఫస్ట్‌ పార్ట్‌ డిసెంబర్‌ 17న విడుదలకు సిద్దమవుతోన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే పుష్ప నుంచి విడుదలైన సాంగ్స్ పాటు ఫస్ట్‌లుక్‌, టీజర్‌, ట్రైలర్‌ విశేష స్పందన వచ్చింది.

Saami Saami Song cover song bye Rekha Boj 1
Saami Saami Song cover song bye Rekha Boj 1

చిత్రం నుండి విడుద‌లైన మూడో సాంగ్ ‘నువ్వు అమ్మి అమ్మి అంటుంటే… నీ పెళ్లాన్నే అయిపోయినట్టుంది రా సామీ’ అంటూ సాగే పాటని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలో విడుదల చేశారు. ఇది ప్ర‌తి ఒక్క‌రిని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. తాజాగా ఈ పాట కోసం ఓ హీరోయిన్ త‌న గాజులు అమ్ముకున్నాన‌ని చెప్పి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

అందం, అభినయం, ఆరబోతలో తగ్గేదే అంటూ దూసుకుపోతున్న విశాఖ బ్యూటీ రేశా.. అవకాశాలు లేకపోయినా, వేషాలు రాకపోయినా ఆత్మస్థైర్యంతో ముందుకెళ్తోంది. సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటూ స్వతాహాగా టాలెంట్ ప్రూవ్ చేసుకుంటోంది. వైజాగ్‌లో ఓ స్టుడియో స్టార్ట్ చేసిన రేఖా భోజ్.. పలు హాట్ వీడియోలు చేస్తూ ఆకర్షిస్తోంది. ఈ క్రమంలోనే ‘పుష్ప’ సినిమాలోని సామీ సామీ పాట కవర్ సాంగ్ చేసింది ఈ వైజాగ్ చిన్నది.

‘పుష్ప’ సినిమా నుంచి రీసెంట్‌గా విడుదలైన సామీ సామీ పాటకు భారీ స్పందన వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పలువురు వ్యక్తులు ఈ పాటకు కవర్ సాంగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ హీరోయిన్ రేఖా భోజ్ దాన్ని ఛాలెంజింగ్‌గా తీసుకుంది. ఈ సాంగ్ రిచ్‌గా ఉండాలని, ఒరిజినల్ సాంగ్‌ని తలదన్నేలా ఉండాలని ఎంతో కష్టపడింది. ఏకంగా ఈ సాంగ్ ఆమె రెండు బంగారు గాజులు అమ్ముకుందంటే ఆ డెడికేషన్ అర్థం చేసుకోవచ్చు.

ఇక ఈ సాంగ్ చూస్తుంటే అచ్చం రష్మికను దించేసినట్టు అనిపిస్తోంది. రారా సామీ.. నా సామీ అంటూ రేఖా భోజ్ కట్టు బొట్టు, ఆ లొకేషన్స్ అన్నీ కూడా అదిరిపోయాయి. సాంగ్ షూట్ చేస్తున్నపుడు వర్షం పడినా కూడా లెక్క చేయకుండా చేశారట. అందుకే ఆ కష్టానికి ప్రతిఫలం కోరుకుంటూ సపోర్ట్ చేయండని సోషల్ మీడియా వేదికగా వేడుకుంది రేఖా భోజ్. ”చాలా కష్టపడి చేశాను.. రెండు గాజులు అమ్ముకున్నా.. మీకు నచ్చితే మీ మీ సోషల్ మీడియాలో ఒక్క షేర్ చేసి సపోర్ట్ అందించండి” అని ఆమె పోస్ట్ పెట్టింది.