Saaho: డాక్ట‌ర్‌ని పెళ్లాడిన సాహో యాక్ట‌ర్.. పెళ్లి ఫొటోలు వైర‌ల్

Saaho ఈ మ‌ధ్య కాలంలో చాలా మంది న‌టీమ‌ణులు డాక్ట‌ర్స్‌ని పెళ్లాడుతున్నారు. తాజ‌గా సాహో న‌టి ఎవ‌లిన్ శ‌ర్మ ఆస్ట్రేలియాకి చెందిన డాక్ట‌ర్ తుషాన్ భిండిని పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లుగా వీరిద్ద‌రు ప్రేమాయ‌ణంలో ఉండ‌గా, ఎట్ట‌కేల‌కు గ‌త నెల‌లో పెళ్లి పీట‌లెక్కారు. కొద్ది సేప‌టి క్రితం ఎవ‌లిన్ శ‌ర్మ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లికి సంబంధించిన ఫొటోల‌ని షేర్ చేస్తూ.. బెస్ట్ ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకోవ‌డం క‌న్నా సంతోష‌క‌రం ఏముంటుంది, వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టినందుకు సంతోషంగా ఉంద‌ని ఎవ‌లిన్ త‌న పోస్ట్‌లో పేర్కొంది. ప్ర‌స్తుతం ఎవ‌లిన్ పెళ్లిఫొటోలు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్చ‌ల్ చేస్తుండ‌గా, ఇవి నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి.

ఫ్రమ్ సిడ్నీ విత్ లవ్’ అనే బాలీవుడ్ సినిమాతో తెరంగేట్రం చేసింది జర్మన్ బ్యూటీ ఎవలిన్ శర్మ. అనంత‌రం రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకొణే జంటగా నటించిన ‘యే జవానీ హై దివానీ’ సినిమాతో న‌టిగా గుర్తింపు తెచ్చుకుంది. ఏ జవానీ హై దీవాని’, ‘యారియన్ , ‘నూతన్ కీ సాలా’, ‘మై తేరా హీరో’, చిత్రాలతో ప్రేక్షకులకు చేరువైన ఎవ‌లిన్ రీసెంట్‌గా సాహో సినిమాలో క‌నిపించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. నెగెటివ్ షేడ్ పాత్ర‌లో న‌టించిన ఎవ‌లిన్‌కు మంచి మార్కులు ప‌డ్డాయి. చేతి నిండా వ‌రుస ఆఫ‌ర్స్ ఉండ‌డంతో ఎవ‌లిన్ ముంబాయిలోని ఓ ఖరీదైన ప్రాంతంలో సొంతంగా ఓ ఫ్లాట్ తీసుకుంది. అంతేకాదు దానికి గృహ ప్రవేశం కూడా చేసింది. నా జీవితంలో ఎన్నో రిబ్బన్స్ కటింగ్స్ చేసాను. కానీ నా ఇంటి రిబ్బన్ కట్ చేయడం చాలా ప్రత్యేకం అంటూ త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది.

సొంతింటి క‌ల‌ను నెర‌వేర్చుకునే క్ర‌మంలో నాకు అండ‌గా నిలిచిన వారికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను అంటూ ఎవ‌లిన్ పోస్ట్‌లో పేర్కింది. పది యేళ్ల కాలంలో ఈ చిత్ర పరిశ్రమ తనకెంతో ఇచ్చిందన్నారు. అయితే 2018లో జ‌రిగిన ఫ్రెండ్స్ పార్టీలో ఆస్ట్రేలియాకు చెందిన తుషాన్‌ని క‌లిసింది. ఏడాది త‌ర్వాత తుషాన్ డేర్ చేసి ఎవ‌లిన్‌కు ప్ర‌పోజ్ చేశాడ‌ట‌. ఆయ‌న ప్ర‌పోజ‌ల్‌కు ఎవ‌లిన్ వెంట‌నే ఓకే చెప్పేసింది. దీంతో 2019 అక్టోబ‌ర్‌లో వీరి నిశ్చితార్థం జ‌రిగింది. ఎప్ప‌టి నుండో పెళ్లి చేసుకుందామ‌ని అనుకుంటున్న‌ప్ప‌టికీ కరోనా వీరి పెళ్లికి బ్రేకులు వేసింది. ఎట్ట‌కేల‌కు ఈ ఏడాది మేలో ఇద్ద‌రు ఒక్క‌ట‌య్యారు. పెళ్లి ఫొటోలను ఎవ‌లిన్ సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా, అవి తెగ వైర‌ల్ అవుతున్నాయి.