Oscars : ఆ మూడు కేటగిరీల్లో ఆర్‌ఆర్‌ఆర్ కి నిరాశ

NQ Staff - January 24, 2023 / 08:48 PM IST

Oscars : ఆ మూడు కేటగిరీల్లో ఆర్‌ఆర్‌ఆర్ కి నిరాశ

Oscars : టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొంది గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ బరిలో నిలుస్తుందని ప్రతి ఒక్క ఇండియన్ సినీ ప్రేమికుడు ఆశించాడు. అంతా ఆశించినట్లుగానే సినిమాలోని నాటు నాటు పాట ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్ కేటగిరీలో నామినేషన్స్ ను సొంతం చేసుకుంది.

బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్ కేటగిరీతో పాటు ఇంకా ఉత్తమ చిత్రం.. ఉత్తమ నటుడు మరియు ఉత్తమ దర్శకుడి కేటగిరీలో కూడా ఆస్కార్ కు నామినేట్‌ అవ్వబోతుందని అంతా భావించారు. వీఎఫ్‌ఎక్స్ విషయంలో కూడా ఆర్‌ఆర్‌ఆర్ కు స్కోప్ ఉందని అభిమానులు ఆశించారు.

ఆ కేటగిరీల్లో ఆర్ ఆర్‌ ఆర్ కి ఛాన్స్ దక్కలేదు. అద్భుతమైన నాటు నాటు ఒక్కటే ఆస్కార్‌ నామినేషన్స్ ను సొంతం చేసుకుంది. ఇటీవలే ఎన్టీఆర్‌ ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ నామినేషన్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఉందని ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ పేర్కొంది.

ఎన్టీఆర్‌ అభిమానులు చాలా ఆశలు పెట్టుకుని ఎదురు చూశారు. కానీ నిరాశే మిగిలింది. దర్శకుడిగా రాజమౌళి కి కచ్చితంగా ఆర్‌ ఆర్‌ ఆర్‌ కి గాను ఆస్కార్‌ లో ఛాన్స్ దక్కాల్సిన ఉంది. కానీ జక్కన్నకు కూడా నిరాశే మిగిలింది. నాటు నాటు పాటకు మాత్రం నామినేషన్ దక్కడం పెద్ద ఊరట.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us