RRR Trailer : ఆర్ఆర్ఆర్ ట్రైల‌ర్‌కి టైం ఫిక్స్.. ఇక అభిమానుల‌కి పూన‌కాలే..!

RRR Trailer : ఇండియన్‌ ప్రస్టీజియస్ చిత్రం `ఆర్‌ఆర్‌ఆర్‌` మూవీ కోసం ప్ర‌పంచ‌మంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. `బాహుబలి` లాంటి సంచలనాత్మక చిత్రాన్ని రూపొందించిన రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న మరో భారీ ప్రతిష్టాత్మక చిత్రమిది. యంగ్ టైగర్‌ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్‌ రామ్‌చరణ్ కలిసి నటిస్తున్నారు. ఇండియన్‌ బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా జ‌న‌వ‌రి 7న విడుద‌ల కానుంది.

RRR Trailer date and time fix
RRR Trailer date and time fix

గ‌త కొద్ది రోజులుగా చిత్ర ప్ర‌మోష‌న్ స్పీడ్ వేగ‌వంతం చేశారు.. `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా ట్రైలర్ ని డిసెంబర్‌ 3న విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం తెలిపింది. ప్రముఖ సినీ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి అకాల మరణంతోపాటు పలు అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నట్లు బుధవారం ఉదయం చిత్రబృందం తెలిపింది. త్వరలో ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ను ప్రకటిస్తామని వెల్లడించింది.

కొద్ది సేప‌టి క్రితం కొత్త డేట్ అనౌన్స్ చేశారు. డిసెంబ‌ర్ 9న ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌నున్న‌ట్టు పేర్క‌న్నారు. ఇక ఆ రోజు అభిమానుల‌కి పూన‌కాలు రావ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. అల్లూరి సీతారామరాజుగా రామ్‌ చరణ్‌, కొమురం భీమ్‌గా తారక్‌ కనిపించనున్న ఈ సినిమాను సుమారు రూ. 450 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రంతో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్‌ టాలీవుడ్‌లోకి అరంగ్రేటం చేయనుంది.

ఇందులో ఆమెకు రామ్‌ చరణ్‌ జోడిగా నటించనున్నారు. ఎన్టీఆర్‌కు జంటగా హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరీస్ అలరించనుంది. కీరవాణి స్వరాలు అందిస్తున్న ఈ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల టీజర్‌ని రిలీజ్‌ చేయగా అది సినిమాపై అంచనాలకు ఆకాశమే హద్దుగా మార్చింది. సినిమా స్థాయిని అమాంతం పెంచేసింది. అలాగే రెండు పాటలు కూడా వచ్చాయి. ఇటీవల విడుదలైన `ఆర్‌ఆర్‌ఆర్‌సోల్‌ ఆంథెమ్‌` ఆడియెన్స్ ని బాగా ఆకట్టుకుంటోంది.

ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రంలో బాలీవుడ్‌ నటి అలియాభట్‌, బ్రిటీష్‌ నటి ఒలివీయా మోర్రీస్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్‌ దేవగన్‌, శ్రియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక సినిమాని జనవరి 7న సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా పదికిపైగా భాషల్లో విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు.