RRR : ఆర్ఆర్ఆర్ టీం ఆస‌క్తిక‌ర పోస్ట్‌.. ఆ ఫోటో పోస్ట్ చేసి నాలుగేళ్లు అయిందా..!

RRR : ప్ర‌స్తుతం టాలీవుడ్ మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్ చిత్రం జ‌న‌వ‌రి 7న విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే. ముందుగా ఈ సినిమాను 2020 జూలై 31న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత కరోనా మహామ్మారి విజృంభనతో ఈ సినిమా షూటింగ్ లేట్ అయింది. ఆ తర్వాత ఈ సినిమాను 8 జనవరి 2021 న మరోసారి రిలీజ్ డేట్ మార్చారు.

RRR Team tweet about rajamouli 4 years back photo
RRR Team tweet about rajamouli 4 years back photo

అప్పటికీ కరోనా కెేసులు తగ్గకపోవడంతో పాటు షూటింగ్ లేట్ కావడంతో ఈ సినిమాను 13 అక్టోబర్ 2021 దసరా కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే మూడు రిలీజ్ డేట్లు ఛేంజ్ చేసుకున్న ఈ సినిమా ఎట్టకేలకు 7 జనవరి 2022న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఒక వారం ముందు థియేటర్స్‌లో విడుదల కానుంది.

RRR Team tweet about rajamouli 4 years back photo
RRR Team tweet about rajamouli 4 years back photo

2022లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో సినిమాల జాతర మొదలు కానుంది. మొత్తంగా ఆర్ఆర్ఆర్ పై అధికారిక ప్రకటన విడుదలైన 4 యేళ్ల తర్వాత 4వ రిలీజ్‌ డేట్‌కు ‘ఆర్ఆర్ఆర్’ విడుదల కావడం విశేషం. ఈ రోజు నుంచి సరిగ్గా 50వ రోజు ‘ఆర్ఆర్ఆర్’ ‘రౌద్రం రణం రుధిరం’ సినిమా విడుదల కానుంది.

‘ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్‌ను సరిగ్గా నాలుగేళ్ల క్రితం 18 నవంబర్ 2017న రాజమౌళి, ఎన్టీఆర్ ,రామ్ చరణ్‌లతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసారు. నందమూరి, మెగా హీరోలతో మల్టీస్టారర్ అనగానే టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా మారింది. అంతకు ముందు రెబల్ స్టార్ ప్రభాస్‌ను ‘బాహుబలి’తో ప్యాన్ ఇండియా స్టార్‌ చేసిన రాజమౌళి .. ఆ తర్వాత ఏ హీరోతో నెక్ట్స్ ప్రాజెక్ట్ చేస్తాడా అనేది ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది

రాజమౌళి నుంచి పిలుపు రావడంతోనే ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు కథ వినకుండా ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పారు. జక్కన్న తమతో సినిమా చేయడమే తమ భాగ్యంగా భావించే స్థితిలో టాలీవుడ్ అగ్ర హీరోలున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రకటించి నాలుగేళ్లు అయిన సందర్భంగా చిత్ర యూనిట్ స్పెషల్‌గా ఓ ట్వీట్ చేసింది.