RRR: ఆర్ఆర్ఆర్ నుండి సంక్రాంతి స్పెష‌ల్ పోస్ట‌ర్.. ఇద్ద‌రు హీరోల లుక్స్ అదిరిపోయాయిగా..!

RRR: యావత్ దేశం ఎంతో ఆస‌క్తిగా ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎదురు చూస్తున్న విష‌యం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని అన్నారు. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. సౌత్ టూ నార్త్ ప్రేక్షకులకు ఆర్ఆర్ఆర్ సినిమాపై రోజు రోజూకీ క్యూరియాసిటీని పెంచేశారు. కాని కరోనా వ‌ల‌న చిత్ర బృందం మూవీని మ‌ళ్లీ వాయిదా వేసింది.

RRR special poster release
RRR special poster release

సినిమా రిలీజ్ వాయిదా త‌ర్వాత ఆర్ఆర్ఆర్ నుండి తాజాగా ఓ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ లుక్స్ ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. ఇందులో రిలీజ్ డేట్ తొల‌గించి, త్వ‌ర‌లోనే మీముందుకు రాబోతున్న‌ట్టు స్ప‌ష్టం చేశారు. ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డి థియేట‌ర్స్ తెరుచుకున్న త‌ర్వాతే ఆర్ఆర్ఆర్ సినిమా విడుద‌ల‌వుతుంద‌నేది టాక్‌. అయితే బ‌య‌ట‌కు చెప్ప‌లేదు కానీ.. రాజ‌మౌళి రిలీజ్ విష‌యంలో ఓ నిర్ణ‌యానికి వ‌చ్చార‌ట‌. .

ఈ ఏడాది స‌మ్మ‌ర్ సంద‌ర్భ‌గా ఏప్రిల్ 1న లేదా ఏప్రిల్ 29న ఆర్ఆర్ఆర్ థియేట‌ర్స్‌లోకి తీసుకు వ‌స్తే ఎలా ఉంటుంద‌నేది వారి ఆలోచ‌న‌గా క‌నిపిస్తుంది. ఆ దిశ‌గా తెలుగు, హిందీ స‌హా ఇత‌ర సినిమా రంగాల‌కు చెందిన సినీ పెద్ద‌ల‌ను ఆర్ఆర్ఆర్ మేక‌ర్స్ చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ట‌. ప‌రిస్థితులు కాస్త చ‌క్క‌బ‌డి థియేట‌ర్స్ పూర్తి స్థాయిలో ఓపెన్ కావ‌డానికి కాస్త స‌మ‌యం ప‌ట్టేలానే క‌నిపిస్తుంది.

నిజానికి 2020 జూలై 30లోనే విడుద‌ల కావాల్సిన ఆర్ఆర్ఆర్ ఇప్ప‌టి వ‌ర‌కు రిలీజ్ కాలేదంటే.. కార‌ణం, కోవిడ్ ప్ర‌భావ‌మే. మ‌రి ఈసారైనా ఆర్ఆర్ఆర్ రిలీజ్ ఏప్రిల్‌లో అయినా రిలీజ్ అవుతుందా? లేదా అనేది చూడాలి. 1920 బ్యాక్‌డ్రాప్‌లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా న‌టిస్తోన్న చిత్రం ఆర్ఆర్ఆర్. చ‌రిత్ర‌లో క‌లుసుకోని ఇద్ద‌రు యోధులు క‌లుసుకుని బ్రిటీష్ వారిని ఎదిరిస్తే ఎలా ఉంటుంద‌నే ఊహాత్మ‌క క‌థాంశంతో రాజ‌మౌళి క‌థ‌ను త‌యారు చేసి సినిమాను రూపొందించారు.

RRR special poster release
RRR special poster release

దాదాపు రూ.600 కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్‌తో డివివి ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై డివివి దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో కొముంర భీమ్‌గా ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామ‌రాజుగా రామ్ చ‌ర‌ణ్ న‌టించారు. ఇంకా బాలీవుడ్ స్టార్స్ అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఆలియా భ‌ట్‌.. హాలీవుడ్ స్టార్స్ ఒలివియా మోరిస్‌, రే స్టీవెన్ స‌న్‌, అలిసన్ డూడి త‌దిత‌రులు న‌టించారు.