RRR : అమెరికాలో విడుదల చేసేది మేమే

RRR : ఇండియాలో అతిపెద్ద మల్టీ స్టారర్ మూవీగా తెరకెక్కుతున్న ‘‘ఆర్ఆర్ఆర్’’ చిత్రాన్ని అగ్ర రాజ్యం అమెరికాలో విడుదల చేయబోయేది తామేనని ‘‘సరిగమ సినిమాస్’’, ‘‘రఫ్తార్ క్రియేషన్స్’’ సంస్థలు సంయుక్తంగా ప్రకటించాయి. ఈ మేరకు ఇవాళ బుధవారం మధ్యాహ్నం ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాయి. ‘‘ఆర్ఆర్ఆర్’’ యూఎస్ఏ థియేట్రికల్ రైట్స్ ని సొంతం చేసుకున్నామని చెప్పటాన్ని సగర్వంగా భావిస్తున్నాం అని అభిప్రాయపడ్డాయి. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పర్చుకున్న తెలుగు తేజం ఎస్.ఎస్.రాజమౌళి ఈ ‘‘రౌద్రం, రణం, రుధిరం‘(ఆర్ఆర్ఆర్)ని ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలిసారిగా కలిసి నటిస్తున్నారు.

RRR : sarigama cinemas & Raftar Creations will release RRR movie in america
RRR : sarigama cinemas & Raftar Creations will release RRR movie in america

యూఎస్ లో ప్రీమియర్ షో ఎప్పుడంటే..

‘ఆర్ఆర్ఆర్’ పిక్చర్ ఇండియాతోపాటు ప్రపంచవ్యాప్తంగా దసరా పండుగని పురస్కరించుకొని అక్టోబర్ 13వ తేదీన విడుదల అవుతుండగా అమెరికాలో మాత్రం ఒక రోజు ముందుగానే అంటే అక్టోబర్ 12వ తేదీనే ప్రీమియర్ షో వేయనున్నట్లు కూడా ఈ రెండు సంస్థలు వెల్లడించాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ మూవీ పంపిణీ బాధ్యతలను కైవసం చేసుకున్న పెన్ స్టూడియోస్ అనే కంపెనీయే ‘ఆర్ఆర్ఆర్’కి సంబంధించిన అన్ని భాషల డిజిటల్, శాటిలైట్ హక్కులను పొందిన సంగతి తెలిసిందే. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తీర్చిదిద్దుతున్న ఈ ఫిల్మ్ లో జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, హిందీ నటి ఆలియా భట్ సీతగా మెరవనున్నారు.

ఇన్ స్పిరేషన్ ఇదే: RRR

‘‘ఆర్ఆర్ఆర్’’ మూవీ తీయటానికి 2004లో విడుదలైన ‘‘ది మోటర్ సైకిల్ డైరీస్’’ అనే చిత్రం తనకు ప్రేరణగా నిలిచిందని జక్కన్న రాజమౌళి రెండేళ్ల కిందట చెప్పారు. మొదట్లో దీనికి ‘‘ఆర్ఆర్ఆర్’’ అని టెంపరరీ టైటిల్ పెట్టారు. చివరికి దాన్నే ఖాయం చేశారు. ఈ మూవీకి స్టోరీని రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ అందిస్తుండగా రాజమౌళి స్క్రిప్ట్, డైరెక్షన్ బాధ్యతలను చూస్తున్నారు. ఆయన సోదరుడు ఎంఎం కీరవాణి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.

Advertisement