RRR: ఆర్ఆర్ఆర్ ర‌న్ టైం ఎంతో తెలుసా?

RRR: ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రాజమౌళి తెర‌కెక్కిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్. భారీ బడ్జెట్.. స్టార్ నటీనటులు.. బాలీవుడ్, హాలీవుడ్ ఫేమస్ యాక్టర్స్ నటిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.

TheNewsQube-
RRR RUN TIME 3HOURS
RRR RUN TIME 3HOURS

ఇటీవల విడుదలైన నాటు నాటు వీర నాటు సాంగ్ నెట్టింట్లో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ చిత్రాన్ని జనవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకుపోతుంది.

ఈ సినిమా నుంచి జననీ సాంగ్ రిలీజ్ చేయనున్నట్లుగా చిత్రయూనిట్ రెండ్రోజుల క్రితం ప్రకటించింది. పెద్దన్న అద్భుతంగా కంపోజ్‌ చేసిన జనని పాట.. ఆర్‌ఆర్‌ఆర్‌ ఎమోషన్‌కు అద్దం పడుతుంది. ఆర్‌ఆర్‌ఆర్‌ సోల్‌ ఆంథమ్‌ ను విడుదల చేస్తున్నారు మేకర్స్. కాసేపట్లో జననీ పాటను ఈరోజు కేవలం థియేటర్లో విడుదల చేయనున్నారు. కాగా ఈపాటను రేపు సోషల్ మీడియాలో అఫీషియల్‏గా విడుదల చేయనున్నారు.

నెక్స్ట్ మంత్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్, మల్టిపుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఉన్నాయి. ప్రత్యేకంగా మీడియాతో ప్రెస్ మీట్ ఉంది. ఆ సమావేశంలో హీరోహీరోయిన్లతో పాటు చిత్రబృందం మొత్తం పాల్గొంటుంది. అందులో విలేఖరులు అడగాలనుకున్న విషయాలను అడగొచ్చని అన్నారు రాజ‌మౌళి.

RRR RUN TIME 3HOURS2 (1)
RRR RUN TIME 3HOURS2 (1)

తాజాగా సినిమా ర‌న్‌టైంకి సంబంధించిన ఆస‌క్తిక‌ర వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. మూడు గంట‌ల స‌మ‌యం ఉంటుంద‌ని తెలుస్తుండ‌గా, ఇది ప్రేక్ష‌కుల‌కి స‌రికొత్త అనుభూతిని పంచ‌నుంద‌ని అంటున్నారు. ఈ సినిమాలో భావోద్వేగ‌భ‌రిత స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌ గుండెను తాకేలా ఉంటాయ‌ని రాజ‌మౌళి చెప్పారు. ఈ విష‌యాల‌ను పంచుకోవాల‌ని నేడు మీడియాతో మాట్లాడుతున్నాన‌ని చెప్పారు. భావోద్వేగానికి సంగీత రూపం ఇస్తే ఎలా ఉంటుందో జ‌న‌ని పాట అలా ఉంటుంద‌ని తెలిపారు.