#RRR : ఎస్.. ఎస్.. రాజమౌళీ.. నో.. నో.. ఇదేం పని?..

#RRR : రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది కదా. దసరాని పురస్కరించుకొని అక్టోబర్ 13న ఆ సినిమాను విడుదల చేసి పండగ చేసుకుందాం కదా అని జక్కన్న అనుకుంటున్న శుభ సందర్భంలో అనుకోని గొడవ ఒకటి మొదలైంది. అదే నెలలో అంటే ‘ఆర్ఆర్ఆర్’ రానున్న రెండు రోజుల అనంతరం (అక్టోబర్ 15న) అజయ్ దేవగణ్ చిత్రం ‘మైదాన్’ను కూడా విడుదల చేద్దామని అనుకున్నారట.

ఎప్పుడో చెప్పాం..

‘మైదాన్’ ఫిల్మ్ కి నిర్మాత ఎవరో కాదు. దివంగత నటి శ్రీదేవి భర్త బోనీ కపూర్. ఆ చిత్రాన్ని ఫలానా తేదీన రిలీజ్ చేయబోతున్నామని ఆయన ఆరు నెలల కిందటే ప్రకటించారట. ఆ సంగతి మన రాజమౌళికి తెలుసో లేదో తెలియదు. తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా ఇలా చేశాడా అనేదీ అర్థం కావట్లేదు. ‘మైదాన్’ విడుదల తేదీకి రెండు రోజుల ముందు ‘ఆర్ఆర్ఆర్’ని రిలీజ్ చేస్తుండటంతో బోనీకపూర్ కి కోపం వచ్చింది. ఇలాంటి పద్ధతి సరికాదని, అన్యాయమనీ ఓ ఇంగ్లిష్ పేపర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.

మంచిది కాదు: #RRR

కరోనా నేపథ్యంలో భారతీయ చలన చిత్ర రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోవటం అందరికీ విధితమే. ఫిల్మ్స్ షూటింగ్స్ లేవు. రిలీజులు లేవు. కలెక్షన్లు లేవు. ఎటు చూసినా థియేటర్లు మూతపడ్డాయి. లాక్డౌన్ ఎత్తేసిన చానాళ్ల తర్వాత ఇప్పుడిప్పుడే పరిస్థితి కాస్త కుదుటపడుతోంది. క్రమంగా మూవీస్ విడుదల అవుతున్నాయి. హాళ్లు కళకళలాడుతున్నాయి. 50 శాతం ఆక్యుపెన్సీ రూల్ ని కూడా లేటెస్టుగా ఎత్తేశారు. ఈ తరుణంలో వివాదాలు తలెత్తడం మంచిది కాదనేది బోనీ కపూర్ ఆలోచన.

కలిసుందాం.. రా..

అసలే కష్టాల్లో ఉన్న ఇండియన్ సినీ ఇండస్ట్రీకి పూర్వ వైభవం తేవటానికి అందరం కలిసి కట్టుగా, కోఆర్డినేషన్ తో ముందుకు పోవాలని బోనీ కపూర్ సూచించారు. అంటే ఎలాంటి గొడవలూ లేకుండా ఫ్రెండ్లీ వాతావరణంలో పనిచేసుకుందాం అనేది ఆయన అభిప్రాయం. రాజమౌళి కూడా మంచోడే. కాంట్రవర్సీలకు కాలు దువ్వే రకం కాదు. కాబట్టి ఈ ఇష్యూ అనుకోకుండానే వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. అజయ్ దేవ్ గణ్ ‘ఆర్ఆర్ఆర్’లోనూ నటించటం కొసమెరుపు.

#RRR : release-date-controversy-with-boney-kapoor
#RRR : release-date-controversy-with-boney-kapoor

ఎవరి మైదానం?: #RRR

ఒక వైపు.. ‘ఆర్ఆర్ఆర్’ని రాజమౌళి 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రూపొందిస్తున్నాడు. ఇందులో టాలీవుడ్ టాప్ హీరోలిద్దరు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇరగదీయబోతున్నారు. చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా. మరో వైపు.. బాలీవుడ్ సీనియర్ హీరో, కాజోల్ భర్త అజయ్ దేవ్ గణ్ కథానాయకుడిగా పాపులర్ ఫుట్ బాల్ ప్లేయర్ సయ్యద్ అబ్దుల్ రహీం నిజ జీవితానికి చిత్ర రూపమే ‘మైదాన్’. అమిత్ రవీంద్రనాథ్ శర్మ డైరెక్టర్.

Advertisement