#RRR వరుస విజయాలతో దూసుకు పోతున్న రాజమౌళి ప్రస్తుతం ఇద్దరు టాలీవుడ్ టాప్‌స్టార్స్‌తో కలిసి ఆర్ఆర్ఆర్ అనే భారీ బడ్జెట్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తుండగా, ఎన్టీఆర్.. కొమురం భీంగా కనిపించి అలరించనున్నాడు. ఈ చిత్ర షూటింగ్ తుది దశకు చేరుకోగా, వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి అక్టోబర్ 13న మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. అయితే గత కొద్ది రోజులుగా ఈ చిత్రానికి సంబంధించి పలు అప్డేట్స్ ఇస్తూ సినీ ప్రేక్షకులకి ఆనందాన్ని పంచుతున్నారు మేకర్స్.
తాజాగా ఎన్టీఆర్, రామ్ చరణ్ లొకేషన్ స్టిల్స్ విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులో ఇద్దరు ఒకే రంగు దుస్తులలో కనిపిస్తుండగా, రామ్ చరణ్ కోర మీసంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఎన్టీఆర్ సరికొత్త లుక్‌లో దర్శనమిచ్చాడు. వీరిద్దరు క్లైమాక్స్ కోసం ప్రాక్టీస్ సెషనల్లో కఠోరంగా శ్రమిస్తూ, బ్రేక్ మధ్యలో కాసేపు చిల్ అవుతున్నారు అని తెలిపారు. కాల్పనిక గాథ ఆధారంగా రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో అలియా భట్, శ్రియ, అజయ్ దేవగణ్, ఒలీవియా మోరిస్ వంటి ప్రముఖ నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ చిత్రం ఎప్పుడో విడుదల కావలసి ఉన్నప్పటికీ కరోనా చాలా దెబ్బ కొట్టింది. సాధారణంగా రాజమౌళి సినిమాలంటేనే సంవత్సరాల తరబడి సెట్స్ మీదుంటాయి. లేట్ అయిన కూడా లేటెస్ట్గా అందించాలనే కసితో రాజమౌళి పని చేస్తారు. హీరోలతోను అలానే పని చేయించి వారికి మంచి విజయాలు అందిస్తుంటారు. ప్రభాస్‌ని బాహుబలి కోసం ఐదేళ్లు వెయిట్ చేయించాడు. అయినప్పటికీ ఈ సినిమాతో ప్రభాస్ రేంజ్ నేషనల్ స్థాయి దాటింది. ఇప్పుడు ఎన్టీఆర్, రామ్ చరణ్ తో చేస్తున్న ఆర్ఆర్ఆర్ తోను ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్ అందించాలనే కసితో ఉన్నాడు జక్కన్న. ఈ సినిమాను అద్భుతమైన శిల్పంలా చెక్కుతూ తాను తెరకెక్కించిన బాహుబలి సినిమా రికార్డులను తానే బ్రేక్ చేయాలని అనుకుంటున్నాడు.
Unwinding in the midst of vigorous practice sessions for THE CLIMAX!! 🤩 #RRRMovie #RRR #RRRDiaries pic.twitter.com/OXqHkh4sUc
— RRR Movie (@RRRMovie) February 5, 2021