Naatu Naatu : బిగ్గెస్ట్ గుడ్ న్యూస్.. ఆస్కార్ బరిలో మన నాటు నాటు
NQ Staff - January 24, 2023 / 08:40 PM IST

Naatu Naatu : తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా యావత్ భారత దేశ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన 95వ ఆస్కార్ అవార్డుల నామినేషన్స్ వెలువడాయి. ఈ నామినేషన్ లో టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేషన్ దక్కించుకుంది.
ఇండియన్ ఫిలిం ఫెడరేషన్ వారు ఆర్ఆర్ఆర్ సినిమాను ఆస్కార్ కి పంపించక పోవడంతో జక్కన్న టీం ఓపెన్ క్యాటగిరిలో ఆస్కార్ కోసం పోటీపడ్డ విషయం తెలిసిందే. ఆస్కార్ అవార్డు రాకున్నా నామినేషన్ లో చోటు దక్కించుకున్నా కూడా గొప్ప విషయం అన్నట్లు తెలుగు ప్రేక్షకులతో పాటు ఇండియన్ సినీ ప్రేక్షకులు భావించారు.
మన నాటు నాటు షార్ట్ లిస్ట్ లో చోటు దక్కించుకున్న సమయంలోనే నామినేషన్స్ ను దక్కించుకున్నట్లే అంటూ అభిమానులు భావించారు. అనుకున్నట్లుగానే మన నాటు నాటుకు అద్భుతమైన ఆస్కార్ నామినేషన్స్ లభించింది.
లగాన్ సినిమా తర్వాత భారతీయ చిత్రానికి ఆస్కార్ నామినేషన్ దక్కడం ఇదే ప్రథమం. 22 ఏళ్ల క్రితం లగాన్ ఆస్కార్ తుది జాబితాలో నిలవగా అవార్డు సొంతం కాలేదు. కానీ ఈసారి కచ్చితంగా మన నాటు నాటుకి ఆస్కార్ దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ అభిమానులు చాలా ధీమాతో ఉన్నారు.
మన నాటు నాటు తో పాటు హోల్డ మై హ్యాండ్ (టాప్ గన్ మావెరిక్), దిసీజ్ లైఫ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ఒన్స్), అప్లాజ్ (టెల్ ఇట్ లైక్ ఏ ఉమన్), లిఫ్ట్ మీ అప్ (బ్లాక్ పాంథర్: వకాండా ఫరెవర్) పాటలు కూడా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేషన్స్ లో ఉన్నాయి. ఈ పాటల్లో ఏ పాటకు ఆస్కార్ వరిస్తుందో చూడాలి.
నాటు నాటు పాటకు కీరవాణి సంగీతాన్ని అందించగా.. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీని అందించాడు. రాహుల్ సిప్లిగంజ్ గాత్రం అందించగా చంద్రబోస్ సాహిత్యాన్ని అందించాడు. ఈ పాటను అద్భుతంగా ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ప్యాలస్ ముందు రాజమౌళి తెరకెక్కించాడు. అద్భుతమైన సన్నివేశంలో ఈ అద్భుతమైన పాట వస్తుంది.