RRR : సిరివెన్నెల అస్త‌మ‌యం.. వాయిదా ప‌డ్డ ఆర్ఆర్ఆర్ ట్రైల‌ర్

RRR : ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రిమృతితో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఫిల్మ్‌ ఛాంబర్‌కు తీసుకొచ్చారు. డైరెక్టర్‌ త్రివిక్రమ్, క్రిష్‌, చిరంజీవి, రాజమౌళి , మ‌హేష్ బాబు, నాగార్జున‌, బాల‌కృష్ణతో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు క‌డసారి క‌న్నీటి నివాళులు అర్పించారు.

RRR movie trailer release postpone duo to Siri Vennela
RRR movie trailer release postpone duo to Siri Vennela

సిరివెన్నెల మృతితో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ట్రైలర్‌ విడుదల వాయిదా పడింది. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లు హీరోలుగా నటిస్తోన్న దర్శక ధీరుడు రాజమౌళి ఈ ప్యాన్‌ ఇండియా సినిమాను తెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్‌ 3న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ట్రైలర్‌ను రిలీజ్‌ చేయాలని చిత్రబృందం ముందుగా నిర్ణయించింది.

అయితే సీతారామశాస్త్రి కన్నుమూతతో దీనిని వాయిదా వేసినట్లు చిత్రబృందం ప్రకటించింది. ట్రైలర్‌ విడుదల కొత్త తేదీని త్వరలోనే చెబుదామంటూ తెలిపింది. దీంతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్‌ ‘ భీమ్లా నాయక్’ ఫోర్త్‌ సింగిల్‌ ‘ అడవి తల్లి’ పాట విడుదల వాయిదాపడింది.

ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ఈ పాటను డిసెంబర్ 1న ఉదయం 10:08 గంటలకు విడుదల చేయాల్సి ఉంది. అయితే తాజాగా సాంగ్‌ రిలీజ్‌ను పోస్ట్‌పోన్‌ చేసినట్లు చిత్రబృందం ప్రకటించింది. చిత్ర పరిశ్ర‌మ‌కు సిరివెన్నెల మృతి తీర‌ని లోటు. అలాంటి లెజెండ్ మ‌ళ్లీ రారు అంటూ చిరంజీవి ఆవేద‌న వ్య‌క్తం చేశారు.