RRR Movie Trailer: ఆర్ఆర్ఆర్ ట్రైల‌ర్ రెడీ.. త్వ‌ర‌లోనే అనౌన్స్‌మెంట్‌..!

RRR Movie Trailer: బాహుబ‌లి త‌ర్వాత ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్ ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తోందా డివివి దానయ్య దీనిని భారీ ఖర్చుతో నిర్మిస్తున్నారు. ఇటీవల షూటింగ్ పూర్తిగా కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం గా అలాగే చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న విషయం తెలిసిందే.

RRR Movie Trailer Date Fixed
RRR Movie Trailer Date Fixed

కొన్ని నెలల క్రితం వీరిద్దరి ఫస్ట్ లుక్ టీజర్స్ యూట్యూబ్ లో రిలీజ్ అయి ఆడియన్స్ నుండి సూపర్ గా రెస్పాన్స్ అందుకున్నాయి. భారీ పేట్రియాటిక్ డ్రామా మూవీగా తెరకెక్కుతున్న ఏ సినిమాలో, అలియా భట్ హీరోయిన్స్ గా నటిస్తుండగా కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ఒక‌దాని త‌ర్వాత ఒక‌టిగా వ‌స్తున్నాయి. నవంబ‌ర్ 26న మూడో సాంగ్ విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. అయితే త్వరలో విడుదల కానున్నఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌తో పూర్తి స్థాయి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలని రాజమౌళి యోచిస్తున్నట్లు తాజా సమాచారం.

రాజమౌళి ఇప్పటికే ట్రైలర్ కట్‌ను లాక్ చేసాడు మరియు అదే అతి త్వరలో విడుదల కానుంది. డిసెంబర్‌ 4న ట్రైలర్‌ను విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. ఇక్క‌డ నుండి సినిమా ప్ర‌మోషన్స్ వేగ‌వంతంగా సాగుతాయాని తెలుస్తుంది. ట్రైల‌ర్‌లో మునుపెన్న‌డు చూడ‌ని స‌న్నివేశాలు ఉంటాయ‌ట‌. క‌నుల పండుగ‌గా ట్రైల‌ర్ ఉంటుంద‌ని అంటున్నారు.

RRR Movie Trailer Date Fixed
RRR Movie Trailer Date Fixed

ఇక దుబాయ్‌లో ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను కూడా నిర్వహిస్తోంది.ఇక ఈ సినిమా నుండి కొన్నాళ్ల క్రితం ఏకంగా ఐదు భాషల్లో విడుదలైన దోస్తీ సాంగ్ అన్ని భాషల శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది. ఐదు భాషలకు చెందిన ఆ సాంగ్ ని ప్రముఖ సింగర్స్ ఆలపించగా తెలుగులో హేమచంద్ర ఎంతో అద్భుతంగా పాడారు.

కీరవాణి అందించిన సూపర్ మ్యూజిక్ ఈ సాంగ్ సూపర్ సక్సెస్ కి ప్రధాన కారణంగా చెప్పవచ్చు నాటు నాటు అనే పల్లవితో సాగే సెకండ్ సాంగ్ ని ఐదు భాషల్లో విడుదల చేయ‌గా, ఇది సినిమాపై అంచ‌నాలను మ‌రింత పెంచింది. ఈ సినిమా సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డం ఖాయం అంటున్నారు.