RRR Movie : ఆర్ఆర్ఆర్ మూడో పాట‌కు ముహూర్తం పెట్టేశారు.. ఎప్పుడో తెలుసా?

RRR Movie : రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌లుగా రూపొందుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాను 2020 జూలై 31న విడుదల చేస్తున్నట్టు ముందుగా ప్రకటించారు. ఆ తర్వాత కరోనా మహామ్మారి విజృంభనతో ఈ సినిమా షూటింగ్ లేట్ అయింది. ఆ తర్వాత ఈ సినిమాను 8 జనవరి 2021 న మరోసారి రిలీజ్ డేట్ మార్చారు.

TheNewsQube-
RRR movie third song date
RRR movie third song date

ఇక అప్పటికీ కరోనా కెేసులు తగ్గకపోవడంతో పాటు షూటింగ్ లేట్ కావడంతో ఈ సినిమాను 13 అక్టోబర్ 2021 దసరా కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే మూడు రిలీజ్ డేట్లు ఛేంజ్ చేసుకున్న ఈ సినిమా ఎట్టకేలకు 7 జనవరి 2022న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఒక వారం ముందు థియేటర్స్‌లో విడుదల కానుంది.

RRR movie third song date
RRR movie third song date

2022లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో సినిమాల జాతర మొదలు కానుంది. మొత్తంగా ఆర్ఆర్ఆర్ పై అధికారిక ప్రకటన విడుదలైన 4 యేళ్ల తర్వాత 4వ రిలీజ్‌ డేట్‌కు ‘ఆర్ఆర్ఆర్’ విడుదల కావడం విశేషం. ఈ రోజు నుంచి సరిగ్గా49వ రోజు ‘ఆర్ఆర్ఆర్’ ‘రౌద్రం రణం రుధిరం’ సినిమా విడుదల కానుంది.

చిత్రం ప్రచారం పనులు స్పీడప్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండు పాటల్ని రిలీజ్ చేసి సినిమాపై అమాతం అంచనాల్ని పెంచేసారు. ఇటీవలే విడుదలైన రెండవ పాట సినిమాపై అంచనాల్ని అంతకంతకు రెట్టింపు చేసింది. చరణ్..తారక్ స్టెప్పుల్లో పోటీ పడటం ఇద్దరి హీరోల అభిమానుల్ని మరింత ఉత్సాహాన్ని నింపింది. చరిత్ర నేపథ్యంలో సాగే చిత్రంలో పక్కా కమర్శియల్ సాంగ్ సినిమాపై అంచనాల్ని పీక్స్ కి తీసుకెళ్లింది.

తాజాగా మూడవ పాట రిలీజ్ కి ముహుర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈనెల 24న మరో కొత్త పాటని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తోందిట. ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ఆ డేట్ సహా టైమ్ కూడా వెల్లడించనున్నట్లు సమాచారం. ఈ పాట విడుదలైన రెండు పాటల్ని మించి ఉంటుందని..కీరవాణి మార్క్ ట్రాక్ ఆకట్టుకుంటుందని టాక్ వినిపిస్తోంది.