RRR: ఆర్ఆర్ఆర్ రిలీజ్ మ‌రోసారి వాయిదా..అభిమానుల‌కు మ‌ళ్లీ నిరాశే..!

RRR: జూనియ‌ర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతున్న ఈ సినిమా ఎప్పుడు విడుద‌ల అవుతుందా అని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లుమార్లు వాయిదా ప‌డ్డ ఈ చిత్రం అక్టోబ‌ర్13న విడుద‌ల కానున్న‌ట్టు మేక‌ర్స్ కొద్ది రోజులుగా చెబుతూ వ‌స్తున్నారు. కాని ఈ చిత్రం ఆ డేట్‌కి రావ‌డం క‌ష్ట‌మ‌ని తెలుస్తుంది.

పాన్ ఇండియా చిత్రంగా తెర‌కెక్కుతున్న ఆర్ఆర్ఆర్ మూవీని దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. ప్రస్తుతం ఉక్రెయిన్ లో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. అయితే.. రాజమౌళి అనౌన్స్ చేసినప్పటికీ.. చెప్పిన డేట్ కి రిలీజ్ చేయడం కష్టమే అంటూ వార్తలు కూడా అప్పట్లో వచ్చాయి.ఇప్పుడు ఆ వార్తలే నిజం కానున్నాయని టాక్ వినిపిస్తోంది. అవును.. ఆర్ఆర్ఆర్ మళ్లీ వాయిదా పడనుందని సమాచారం.

రాజమౌళి ఉక్రెయిన్ లో పాట చిత్రీకరణ పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేయనున్నారు. ఆ తర్వాత కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తారని తెలిసింది. అయితే.. అక్టోబర్ కు రిలీజ్ వాయిదా పడితే సంక్రాంతికి రిలీజ్ చేసే ఛాన్స్ ఉందనే టాక్ వినిపించింది.కాని అప్పుడు పెద్ద హీరోల సినిమాలు విడుద‌లకు సిద్ధంగా ఉన్న నేప‌థ్యంలో క్రిస్మస్ కానీ.. రిపబ్లిక్ డే కి కానీ ఆర్ఆర్ఆర్ ను విడుదల చేయాలనుకుంటున్నట్లు తాజా సమాచారం.

అక్టోబర్ 8న అఖండ చిత్రాన్ని విడుదల చేయాలనే నిర్ణయానికి మేక‌ర్స్ వచ్చినట్టు ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. ఈ వార్త‌తోనే అభిమానులు ఆర్ఆర్ఆర్ అక్టోబ‌ర్ 13న రిలీజ్ కానుంద‌ని భావించారు. తాజాగా సోష‌ల్ మీడియాలో ఆర్ఆర్ఆర్ అక్టోబ‌ర్ 13న రాద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది.మ‌రి ఇందులో ఎంత నిజం ఉంద‌నేది చిత్ర యూనిట్ క్లారిటీ ఇస్తే కాని తెలియ‌నుంది.

ఫైనల్‌ షెడ్యూల్‌లో భాగంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీం ఉక్రెయిన్‌లో ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. కాగా ఆలియా భట్‌, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తుండగా అజయ్‌ దేవగన్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఆర్‌ఆర్‌ఆర్‌ టీం ప్రమోషన్‌ కార్యక్రమాలను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే మేకింగ్‌ వీడియాతో పాటు ఇటీవలె దోస్తీ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

కాగా ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు అలరించనున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు చిత్రానికి సంబంధించి విడుద‌లైన ప్ర‌చార చిత్రాలు సినిమాపై భారీ అంచ‌నాలు పెంచాయి.