RRR : ఆర్ఆర్ఆర్ నుండి వ‌ర్కింగ్ స్టిల్స్ విడుద‌ల‌.. ఎన్టీఆర్ లుక్ చూసి థ్రిల్ అవుతున్న ఫ్యాన్స్

RRR : ప్ర‌స్తుతం దేశం మొత్తం ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎంత ఆస‌క్తిగా ఎదురు చూస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇటీవల షూటింగ్ పూర్తిగా కంప్లీట్ చేసుకున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం గా అలాగే చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న విషయం తెలిసిందే. కొన్ని నెలల క్రితం వీరిద్దరి ఫస్ట్ లుక్ టీజర్స్ యూట్యూబ్ లో రిలీజ్ అయి ఆడియన్స్ నుండి సూపర్ గా రెస్పాన్స్ అందుకున్నాయి.

TheNewsQube-
RRR movie NTR working stills
RRR movie NTR working stills

భారీ పేట్రియాటిక్ డ్రామా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో, అలియా భట్ హీరోయిన్స్ గా నటిస్తుండగా కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. బాహుబలి సినిమాల తరువాత రాజమౌళి తీస్తున్న సినిమా కావడంతో పాటు తొలిసారిగా ఎన్టీఆర్, చరణ్ కలిసి నటిస్తుండడం ఈ సినిమాకి ఇంత భారీ హైప్ రావడానికి కారణం.

RRR movie NTR working stills
RRR movie NTR working stills

మరోవైపు ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్స్ వంటివి సినిమాపై సూపర్ గా రెస్పాన్స్ దక్కించుకోవడంతో దీనిపై ఆకాశమే హద్దుగా అంచనాలు ఏర్పడ్డాయి. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా ఎంతో అత్యద్భుతంగా రాజమౌళి ఈ సినిమాని తీర్చిదిద్దారని, లేట్ గా రిలీజ్ అవుతున్నప్పటికీ లేటెస్ట్ గా గత రికార్డ్స్ అన్ని కూడా బద్దలు కొట్టి ఇండియన్ మూవీ హిస్టరీ లో ఆర్ఆర్ఆర్ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయం అంటున్నారు.

RRR movie NTR working stills
RRR movie NTR working stills

ఈ సినిమాకి సంబంధించి ఏ అప్‌డేట్ వ‌చ్చిన కూడా కొద్ది క్ష‌ణాల‌లో వైర‌ల్ అవుతుంది. తాజాగా చిత్రం నుండి వ‌ర్కింగ్ స్టిల్స్ విడుద‌ల చేశారు. ఇందులో ఎన్టీఆర్ ప‌వ‌ర్ ఫుల్ లుక్స్ ఆక‌ట్టుకుంటున్నాయి. ప్ర‌స్తుతం ఈపిక్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

RRR movie NTR working stills
RRR movie NTR working stills

రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్‏తో డీవీవీ ఎంటర్‏టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా చరిత్రలో ఎన్నడూ కలవని ఇద్దరూ వీరులను కలిపి చూపే ప్రయత్నం చేస్తున్నాడు జక్కన్న. ఇందులో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్ పాత్రలో తారక్ నటిస్తున్నారు. ఇక వీరిద్దరికి జంటగా అలియా భట్, ఒలివియా మోరీస్ నటిస్తున్నారు.

RRR movie NTR working stills
RRR movie NTR working stills